Asianet News TeluguAsianet News Telugu

రాత్రి పూట ఒంటరిగా రోడ్డుపై....: వీడుతున్న గుంటూరు టెక్కీ తనూజ కేసు చిక్కుముళ్లు

విజయవాడ‌లో సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని తనూజ మృతి కేసులో చిక్కుముళ్లు వీడుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో తనూజ‌ను పోలీసులు గుర్తించారు. ఈ నెల 16న రాత్రి 8.30 గంటల సమయంలో కంచనపల్లి వద్ద హైవేపై తనూజ ఒంటరిగి నడుస్తూ కనిపించింది.

Key update in guntur software employee tanuja death case
Author
Vijayawada, First Published Jan 22, 2022, 11:47 AM IST

విజయవాడ‌లో సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని తనూజ మృతి కేసులో చిక్కుముళ్లు వీడుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో తనూజ‌ను పోలీసులు గుర్తించారు. ఈ నెల 16న రాత్రి 8.30 గంటల సమయంలో కంచనపల్లి వద్ద హైవేపై తనూజ ఒంటరిగి నడుస్తూ కనిపించింది. అదే రోజు తెనాలికి చెందిన స్నేహితుడికి ఫోన్ చేసిన తనూజ.. అతని బైక్‌ మీద వడ్డేశ్వరం వద్ద దిగింది. వడ్డేశ్వరం వద్ద బంధువుల ఇంటికి వెళ్తున్నానని తనూజ స్నేహితుడికి చెప్పింది. ఈ కేసులకు సంబంధించి తనూజ స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. 

హైవేపై ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన తనూజను చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తీసుకొచ్చి ఉంటారని.. ఆ తర్వాత ఆమె చనిపోవడంతో రోడ్డుపై పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హైవేపై తనూజ నడిచిన రూట్‌లో సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు అదుపులోకి తీసుకున్న తనూజ స్నేహితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

ఇక, కొద్ది రోజుల కిందట విజయవాడ శిఖామణి సెంటర్‌లో (vijayawada shikhamani center) రోడ్డు పక్కన ఈమె మృత‌దేహం ల‌భించింది. తొలుత గుర్తు తెలియ‌ని మ‌హిళ మృతదేహంగా పోలీసులు కేసు న‌మోదు చేశారు. త‌రువాత ఆమె ఆదివారం నుంచి ఇంట్లో నుంచి క‌నిపించ‌కుండా పోయినా త‌నూజ (30)గా గుర్తించారు. తనూజ మృదేహం దొరికిన ప్ర‌దేశంలో సీసీ కెమెరాలు (cc camera) ఉన్న‌ప్ప‌టికీ అవి స‌రిగా ప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల అందులో ఎలాంటి దృశ్యాలు రికార్డ్ కాలేదు.

అసలేం జ‌రిగిందంటే.. 
గుంటూరుకు చెందిన ఓ టెకీ తనూజ‌కు 2018లో మ‌ణికంఠతో వివాహం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఐటీ ఉద్యోగులే.  వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. భార్యాభర్తలు బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే కొవిడ్‌ కారణంగా కొంతకాలంగా ఇంటి దగ్గర నుంచి పని చేస్తున్నారు. అయితే ఈ నెల 16న ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన తనూజ మరుసటి రోజు వరకు తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆమె విజ‌య‌వాడ శిఖామణి సెంటర్‌లో ఆదివారం రాత్రి శ‌వ‌మై క‌నిపించింది. దీంతో అక్క‌డి పోలీసులు గుర్తు తెలియ‌ని మృతదేహంగా కేసు న‌మోదు చేసి.. ఆమె ఫొటోను అన్ని పోలీసు స్టేష‌న్ల‌కు పంపించారు. ఆ ఫొటో త‌నూజ‌ను పోలి ఉండ‌టంతో కుటుంబ సభ్యులు అక్క‌డి వెళ్లి నిర్ధారించుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios