తెలుగుదేశం నేత కేశినేని శివనాథ్ (చిన్ని) కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే తాను విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలుస్తానని చెప్పారు.
తెలుగుదేశం నేత కేశినేని శివనాథ్ (చిన్ని) కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే తాను విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలుస్తానని చెప్పారు. అయితే టికెట్ తనకిచ్చినా, వేరే ఎవరికైనా ఇచ్చినా.. పార్టీ అభ్యర్థిని గెలిపించి తీరుతామని తెలిపారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయటమే అజెండాగా అందరం కలిసి పని చేస్తున్నామన్నారు. అయితే ప్రస్తుతం విజయవాడ నుంచి ఎంపీగా టీడీపీ నేత కేశినేని నాని ఉన్నారు. కేశినేని శివనాథ్‌కు కేశినేని నాని సోదరుడు అవుతారనే సంగతి తెలిసిందే.
కేశినేని చిన్నితో పాటు జిల్లాకు కొందరు టీడీపీ నేతలతో కేశినేని నానికి విభేదాలు ఉన్నాయి. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తదితర టీడీపీ నేతలతో కలిసి కేశినేని నాని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే సోదరుల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. కొన్ని సందర్భాల్లో టీడీపీ అధిష్టానానికి, కేశినేని నానికి మధ్య దూరం పెరిగిందనే వార్తలు కూడా ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టికెట్ల విషయంలో టీడీపీ అధిష్టానం టికెట్ల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
