2019లో పత్తికొండ నుండి కేఈ వారసుడు: డీప్యూటీ సీఎం ఎక్కడి నుండి?

KE shyam babu contest from Pattikonda segment in 2019 elections says deputy CM KE krishnamurthy
Highlights

వచ్చే ఎన్నికల్లో  పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  తన తనయుడు కేఈ శ్యాంబాబు  పోటీ చేస్తారని డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. తన రాజకీయ వారసుడిగా వచ్చే ఎన్నికల్లో  శ్యాంబాబు  వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని  కేఈ కృష్ణమూర్తి  ప్రకటించారు

కర్నూల్: వచ్చే ఎన్నికల్లో  పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  తన తనయుడు కేఈ శ్యాంబాబు  పోటీ చేస్తారని డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. తన రాజకీయ వారసుడిగా వచ్చే ఎన్నికల్లో  శ్యాంబాబు  వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని  కేఈ కృష్ణమూర్తి  ప్రకటించారు.అయితే వచ్చే ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి పోటీ చేస్తారా లేదా అనే  విషయమై  ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కర్నూల్ జిల్లా టీడీపీలో కీలకంగా ఉన్న  డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తన తనయుడు శ్యాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. కొంతకాలంగా  పత్తికొండ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను శ్యాంబాబు పర్యవేక్షిస్తున్నారు.

పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి  వయసు పెరగడం ఇతరత్రా కారణాలతో తన కొడుకును పత్తికొండ నియోజకవర్గం నుండి బరిలోకి దింపాలని భావిస్తున్నారు. 

గత ఎన్నికల సమయంలో కూడ శ్యాంబాబు ఈ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో  సోమవారం నాడు జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఈ విషయాన్ని ప్రకటించారు. తన కొడుకు శ్యాంబాబు వచ్చే ఎన్నికల్లో  పత్తికొండ నుండ బరిలోకి దిగుతాడని ప్రకటించారు.

అయితే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా... లేదా అనే విషయమై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఈ  విషయమై  ప్రస్తుతం పార్టీలో చర్చ సాగుతోంది. కొడుకును  పత్తికొండ నుండి బరిలోకి దింపి కేఈ  ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారా..  లేదా  మరో నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతారా అనే విషయమై చర్చ కూడ లేకపోలేదు.

అయితే పత్తికొండ నుండి శ్యాంబాబు పోటీ చేస్తారని మాత్రం కేఈ కృష్ణమూర్తి స్పష్టత ఇచ్చారు. మరో వైపు  కేఈ కృష్ణమూర్తి సోదరుడు  కేఈ  ప్రభాకర్  కూడ  వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు.గత ఎన్నికల్లో  కొన్ని కారణాలతో కేఈ ప్రభాకర్ కు టీడీపీ టిక్కెట్టు దక్కలేదు. 

అయితే ఇటీవల కాలంలో మారిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు కేఈ ప్రభాకర్ క్షమాపణ చెప్పాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.దీంతో కేఈ ప్రభాకర్ కు  ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాడు చంద్రబాబునాయుడు. అయితే వచ్చే ఎన్నికల్లో కేఈ ప్రభాకర్ పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా 
స్పష్టత రావాల్సి ఉంది. కేఈ ప్రభాకర్ కూడ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. 

 

loader