Asianet News TeluguAsianet News Telugu

నంద్యాల ఉపఎన్నికపై వ్యూహమేంటి ?

ఒకవైపు ఏకగ్రీవంగా నంద్యాలను కైవసం చేసుకునేందుకు రాయబారాలు పంపుతూనే ఇంకోవైపు ఎన్నికలో గెలవటానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంటే నంద్యాల ఉపఎన్నిక విషయంలో చంద్రబాబు రకరకాల వ్యూహాలేవో పన్నుతున్నట్లే అనిపిస్తోంది.

Ke requesting jagan not to put candidate in namdyala by poll

నంద్యాల ఉపఎన్నిక పోటీ విషయంలో చంద్రబాబునాయుడు చాలా పెద్ద వ్యూహమే పన్నినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే, ఒకవైపు పోటీ పెట్టవద్టని జగన్ను బ్రతిమాలాడుకుంటూనే ఇంకోవైపు ఎలాగైనా ఉపఎన్నికలో గెలిచితీరాలంటూ అల్టిమేటమ్ ఇస్తున్నారు. ఒకవైపు ఏకగ్రీవంగా నంద్యాలను కైవసం చేసుకునేందుకు రాయబారాలు పంపుతూనే ఇంకోవైపు ఎన్నికలో గెలవటానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంటే నంద్యాల ఉపఎన్నిక విషయంలో చంద్రబాబు రకరకాల వ్యూహాలేవో పన్నుతున్నట్లే అనిపిస్తోంది.

తాజాగా ఈరోజు నంద్యాలలో కెఇ మీడియాతో మాట్లాడుతూ, నంద్యాల ఉపఎన్నిక విషయంలో జగన్ పోటీ పెట్టకూడదంటూ బ్రతిమలాడుకున్నారు.  మీడియాతో మాట్లాడుతూ, ‘జగనూ ప్లీజ్ కాస్త ఆలోచించవా’ అంటూ కెఇ వేడుకుంటున్నారు. నిజంగా గెలిచేసత్తా ఉంటే ఇలా బ్రతిమలాడుకోవాల్సిన అవసరం ఏంటి? టిడిపి అధికారంలో ఉంది. అంగ బలముంది. అర్ధబలమూ ఉంది. అయినా ఎందుకని ప్రతిపక్ష పార్టీ నుండి ఎవరిని పోటీలోకి దింపొద్దని వేడుకుంటోంది?  

ఈరోజు నంద్యాల అతిధిగృహంలో ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై కెఇ ఆధ్వర్యంలో విస్తృతస్ధాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సహచర మంత్రులు అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులుతో పాటు మాజీ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత కెఇ మీడియాతో మాట్లాడుతూ, ఉపఎన్నికలో పోటీ విషయమై జగన్ ఇంకోసారి ఆలోచించాలంటూ అభ్యర్ధించారు. అలా అంటూనే అవినీతి కేసులు ఎదుర్కొంటున్న జగన్ పార్టీలో శిల్పామోహన్ రెడ్డి చేరటం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేయటం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios