Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ : బెజవాడలో బీఆర్ఎస్ పేరిట హోర్డింగ్‌లు, పోస్టర్‌లు

కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో బెజవాడలోని బీఆర్ఎస్ పేరిట పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు వెలిశాయి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండి రమేశ్ పేరిట వారధి సెంటర్ వద్ద భారీ హోర్డింగ్ వెలిసింది. 

kcrs brs posters and hordings in vijayawada
Author
First Published Oct 5, 2022, 5:36 PM IST

జాతీయ రాజకీయాలే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా ప్రకటించారు. బుధవారం జరిగిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. బీఆర్ఎస్‌పై జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు కేసీఆర్ తీరుపై స్పందిస్తున్నారు . ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా హోర్డింగ్‌లు, బ్యానర్లు కట్టారు. ఇటు ఏపీలోనూ కేసీఆర్ అభిమానులు బీఆర్ఎస్‌ను స్వాగతిస్తూ భారీగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. 

ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని కీలక నగరం బెజవాడలో బీఆర్ఎస్ పేరిట పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు వెలిశాయి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండి రమేశ్ పేరిట వారధి సెంటర్ వద్ద భారీ హోర్డింగ్ వెలిసింది. వారిధితో పాటు విజయవాడలోని ఇతర ప్రాంతాల్లోనూ పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు కేసీఆర్ అభిమానులు. ఈ వ్యవహారం బెజవాడలో హాట్ టాపిక్‌గా మారింది. 

ALso REad:టీఆర్ఎస్ ఇక నుండి బీఆర్ఎస్: విస్తృత స్థాయి సమావేశం తీర్మాణం

అంతకుముందు తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్ . బుధవారం నాడు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి ముందుగా కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు దారి తీసిన పరిస్థితులను కేసీఆర్ వివరించారు. జాతీయ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుందనే విషయమై కేసీఆర్ వివరించారు.

బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల  దేశంలో వెనుకబడిపోతుందన్నారు. బంగ్లాదేశ్ కంటే మన దేశం వెనుకబడి ఉండడం ఏమిటని కేసీఆర్ ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ ను ఈ సమావేశానికి రావొద్దని తానే చెప్పినట్టుగా తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని కేసీఆర్ వెల్లడించారు. ఈ కారణంగానే తాను అఖిలేష్ ను రావొద్దని చెప్పానని... ములాయం కోలుకున్న తర్వాత అందరం కలిసి వస్తారనే ఆకాంక్షను కేసీఆర్ వ్యక్తం చేశారు. దేశ ప్రజల కోసమే బీఆర్ఎస్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా సీఎం చెప్పారు. రైతు సంక్షమమే ఎజెండాగా ముందుకు సాగుతామని కేసీఆర్ వివరించారు. మహరాష్ట్ర నుండి పర్యటనను ప్రారంభించనున్నట్టుగా ఆయన ప్రకటించారు. కర్ణాటకలో కూడా మన జెండా ఎగురాలని కేసీఆర్ ఆకాంక్షించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios