విజయవాడ: కృష్ణా తీరంలోని శారదా పీఠాధిపతి సన్యాసదీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష ముగింపు కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోమవారం నాడు సాయంత్రం పాల్గొన్నారు.

ఈ నెల 21వ తేదీన పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని  ఆహ్వానించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు విజయవాడకు వచ్చారు.ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసి పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. సుమారు రెండు గంటల పాటు  పలు అంశాలపై చర్చించారు.

అక్కడి నుండి నేరుగా ఒకే కారులో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌లు  కృష్ణా తీరంలోని శారదా పీఠానికి చేరుకొన్నారు.పీఠానికి చేరుకొన్న తర్వాత శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకొన్నారు.

విశాఖ  శారదా పీఠాధిపతి ఉత్తరాది సాత్మానందేంద్ర స్వామిగా నామకరణాన్ని ప్రకటిస్తున్నట్టుగా స్వరూపానందేంద్రస్వామి ప్రకటించారు.