ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు ఎందుకు అవసరమో చెప్పారు. ఇలా చెబుతున్న తరుణంలో ఆయన చారిత్రక వాస్తవాలను ఉటంకిస్తూ... బ్రిటిషు కాలం నుంచి మొదలుకొని తెలంగాణ ప్రాంతం వరకు ఏయే  కారణాల వల్ల సబ్ నేషనలిజం ఉద్యమాలు ఉద్భవించాయో ఆయన తెలిపారు. 

ఆ తరువాత గతంలో వైసీపీ ప్రభుత్వ ఆరోపణ అయిన ఇన్సైడర్ ట్రేడింగ్ విషయాన్నీ మల్లీ ప్రస్తావిస్తూ... ఎవరెవరికి ఎంతెంత భూముందో చెప్పారు. ఇక చివర్లో ఆయన ఒక పిట్టా కథ చెప్పారు. సాధారణంగా ఇలాంటి పిట్టకథలు చెప్పడంలో తెలంగాణ ముఖ్యమంత్రి దిట్ట. 

Also read; తెలంగాణ పరిస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతోనే....: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

బహుశా తెరాస తో కొనసాగుతున్న దగ్గరి సంబంధాల వల్లనో ఏమో కానీ బుగ్గన గారు కూడా పిట్టా కథ చెప్పారు. ఆయన రామాయణంలోని లంకా దహన ఘట్టంలో ఒక విషయాన్నీ ప్రస్తావించారు. 

లంకకు వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామిని అక్కడున్నవారు అడిగారట.... తిథి వార నక్షత్రాలు చూసుకొని వచ్చారా అని ఆంజనేయ స్వామిని కనుక్కున్నారట. దానికి ఆంజనేయస్వామి ఆపండిస్తు.. తిథి నక్షత్రాలను చూసుకొని రాలేదని, కేవలం శ్రీ రామ నామ స్మరణను మాత్రమే నమ్ముకొని వచ్చానని చెప్పారట. 

అదే విధంగా జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఎటువంటి తిథి, వార నక్షత్రాలను చూడలేదని, కేవలం ప్రజా అభివృద్ధి నామ స్మరణను మాత్రమే నమ్ముకొని ఈ వికేంద్రీకరణ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపారు. 

మొత్తానికి తెరాస తో కొనసాగుతున్న స్నేహం పుణ్యమో లేక పర్సనల్ గా కెసిఆర్ తో ఉన్న సాన్నిహిత్యం వల్లనో.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా పిట్టకథ ఒకటి పుట్టుకొచ్చింది. 

Also read; టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూములివే: అసెంబ్లీలో బయటపెట్టిన మంత్రి బుగ్గన

ఇక భూములు ఎవరెవరు కొన్నారో వివరిస్తూ బుగ్గన చాలా మంది పేర్లు చెప్పారు. చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితంగా  ఉన్న వేమూరి ప్రసాద్,  మాజీ ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, జీవీఎస్ ఆంజనేయులుకు భూములు కొనుగోలు చేశారని చెప్పారు.  జీవీఎస్ ఆంజనేయులు కుటుంబానికి  సుమారు 40 ఎకరాల భూములు ఉన్నాయన్నారు.  పరిటాల సునీత కుటుంబానికి   ధరణికోట, బలుసుపాడులో , నెమలికల్లు గ్రామాల్లో  భూములు కొనుగోలు చేశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

లింగమనేని రమేష్‌కు కూడ మంగళగిరి, కాజా తదితర ప్రాంతాల్లో భూములు కోనుగోలు చేశారన్నారు. మరో వైపు టీడీపీ మాజీ  అధికార ప్రతినిధి లంక దినకర్‌కు కూడ భూములు ఉన్నాయన్నారు. పయ్యావుల విక్రమ్ సింహా పేరుతో ఐనవోలులో భూములు ఉన్నాయన్నారు.

వీరితోపాటు పరిటాల సునీత, ఇతరుల పేర్లు కూడా చదువుతూ వారే కాకుండా వారి బినామీల పేరు మీద కూడా ఎన్నో భూములున్నాయని అన్నారు.