తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్.. విజయం దాదాపు ఖరారైంది. మరోసారి ఆయన సీఎం పీఠాన్ని అదిరోహించనున్నారు. దాదాపు 90 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపు జెండాలను ఎగురవేసేందుకు రెడీగా ఉంది. కాగా.. కేసీఆర్ విజయంపై ఏపీలోని ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో.. కేసీఆర్ కి ఏపీలో పాలాభిషేకాలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో ఆయన  గెలుపు కోసం ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో పూజలు చేసినవారు కూడా ఉన్నారు. వాటి ప్రతిఫలంగా.. ఇప్పుడు కేసీఆర్.. తెలంగాణలో విజయదుందుబీ మోగించారు.

అయితే.. కేసీఆర్ విజయం పట్ల ఆనందంతో.. విజయవాడకు చెందిన ఆయన అభిమాని కొణిజేటి ఆదినారాయణ.. సంబరాలు జరుపుకున్నారు. ఆనందంతో అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఇప్పటికైనా మహాకూటమి నేతలు కేసీఆర్ ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని  ఆయన హితవు పలికారు. కేసీఆర్ తెలంగాణకు చేసిన అభివృద్ధే ఆయనను గెలిపించిందని అభిప్రాయపడ్డారు.  టీఆర్ఎస్ కండువా మొడలో కప్పుకొని మరీ.. స్వీట్లు పంపిణీ చేయడం గమనార్హం.