నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ ఇంట్లో చోరి

kavali ycp mla ramireddy pratap kumar house robbery
Highlights

ఎమ్మెల్యే భార్య ఇంట్లో ఉండగా చోరీ...

నెల్లూరు జిల్లా కావలి లో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఇంట్లో ఈ చోరీకి పాల్పడ్డారు.ఇంట్లో ఎమ్మెల్యే భార్య ఉండగా దొంగలు చోరీకి పాల్పడటం గమనార్హం.

ఈ చోరీకి సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నారు. కావలిలోని వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే  రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇంట్లో రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు ప్రవేశించారు. ఎమ్మెల్యే బంధువులమంటు ఇంటి బయట వున్న కారు డ్రైవర్ కి చెప్పి ఇంట్లోకి ప్రవేశించారు. ఎమ్మెల్యే భార్య ఆదిలక్ష్మి ఇంట్లోనే ఉన్నప్పటికి ఆమె కంట పడకుండా చోరీ కానిచ్చారు. ఇంట్లో కొన్ని విలువైన వస్తువులను అత్యంత చాకచక్యంగా తస్కరించి పరారయ్యరు.

ఈ దొంగతనంపై ఎమ్మెల్యే డ్రైవర్ గురిమీడి సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగలు రెండు వెండి కంచాలు, వెండి గ్లాసులు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

ఈ పిర్యాదు మేరకు కావలి రూరల్‌ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే నివాసంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరీశీలించడంతో పాటు క్లూస్ టీం సాయంతో చోరీకి పాల్పడిన దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. 

loader