Asianet News TeluguAsianet News Telugu

కాట్రేనిపాడు డబుల్ మర్డర్: హత్యకు ముందు తల్లీకూతురిపై అత్యాచారం

ఏలూరు జిల్లాలోని  కాట్రేనిపాడులో  తల్లీ కూతురును  హత్య చేసిన  నిందితుల కోసం   పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Katrenipaudu double murder case:  Police Found  Rape on Victimes before murder
Author
First Published Feb 7, 2023, 2:55 PM IST

ఏలూరు: జిల్లాలోని  కాట్రేనిపాడులో  తల్లీ కూతురును హత్య చేసిన   నిందితుల  కోసం పోలీసులు గాలింపు  చర్యలు చేపట్టారు. హత్యకు ముందు నిందితులు  తల్లీ కూతురిపై  అత్యాచారం చేసినట్టుగా  పోలీసులు గుర్తించారు.  

ఈ నెల  4వ  తేదీన  ఇంట్లో  తల్లీ కూతుళ్లు హత్యకు గురైన విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితుల కోసం  పోలీసు బృందాలు  గాలింపు చర్యలు చేపట్టారు.

ఏలూరు జిల్లాలోని  కాట్రేనిపాడు సమీపంలో గల ఎన్టీఆర్ నగర్ లో   మరియమ్మకు ఇద్దరు ఆడపిల్లలు.  గొడవల కారణంగా భర్తతో  ఆమె విడిపోయింది. అనారోగ్య కారణాలతో మరియమ్మ  రెండో కూతురు మృతి చెందింది.  మరియమ్మ ఆమె  16 ఏళ్ల కూతురుతో  కలిసి ఉంటుంది.  మరియమ్మ కూలీ పనులు చేసి  జీవనం సాగించేది.

 జిల్లాలోని  బొమ్ములూరుకు చెందిన  దేవరపల్లి రవిందర్ తో  పదేళ్ల నుండి   మరియమ్మ సహజీవనం చేస్తుంది. అయితే  రవీందర్  మద్యానికి బానిసగా మారిడంతో  వీరిద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. దీంతో  మరియమ్మ  పుట్టింటికి వెళ్లిపోయింది.  అయితే  పుట్టింటికి వెళ్లిన  మరియమ్మను  ఈ నెల  3వ తేదీన రవీందర్ తీసుకువచ్చాడు. మద్యం తాగానని మాటిచ్చాడు . పుట్టింటి నుండి వచ్చిన  మరునాడే  మరియమ్మ, ఆమె కూతురు మృతి చెందారు.

ఈ నెల  4వ తేదీన  మరియమ్మకు ఫోన్ చేస్తే ఆమె స్పందించలేదు. దీంతో  ఇంటికి వచ్చాడు ఆమె సోదరుడు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి  సోదరి మరియమ్మ, ఆమె కూతురు హత్యకు గురైనట్టుగా గుర్తించాడు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మరియమ్మను ఆమె కూతురును  రవీందర్  హత్య చేసినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేయడానికి ముందు  మరియమ్మ ముందే  ఆమె కూతురిపై అత్యాచారం చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  అంతేకాదు  మరియమ్మసై కూడా  అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసినట్టుగా  పోలీసులు భావిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన  రవీందర్ తో పాటు అతని స్నేహితుడు చందు కోసం  పోలీసులు గాలిస్తున్నారు. వీరిద్దరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.   ఈ ఇధ్దరు నిందితుల కోసం  నాలుగు పోలీసు బృందాలు  గాలిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios