విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో చోటు దక్కకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కేబినెట్ లో చోటు దక్కకపోవడంపై బాధలేదంటూనే తన ఆవేదన వ్యక్తం చేశారు. 

విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్న కాటసాని మంత్రి పదవి దక్కకపోవడంపై అంతగా బాధపడటం లేదన్నారు. మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అన్నది సీఎం జగన్ నిర్ణయమన్నారు. సామాజిక వర్గాల కూర్పు నేపథ్యంలో తనకు మంత్రి పదవి దక్కలేదన్నారు. 

మంత్రి వర్గం కూర్పు చూస్తుంటే తాను ఎందుకు ఎస్సీ, బీసీలుగా ఎందుకు పుట్టలేదా అని బాధపడుతున్నట్లు తెలిపారు. ఒకవేళ ఎస్సీ, బీసీలుగా పుట్టి ఉంటే తన సీనియారిటీకి కచ్చితంగా మంత్రి పదవి వచ్చేదన్నారు. సీనియారిటీ ఉన్నా మంత్రి పదవి దక్కలేదని అభిమానులు కార్యకర్తలు ఆందోళన చెంది ఉండొచ్చని ఆందోళన చెందొద్దంటూ పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి.