బిడ్డ పుట్టాక భర్త తనను వదిలేశాడని ఓ వివాహిత ఆందోళనకు దిగింది. కర్నాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన కళావతి అనే మహిళ ... తనను కడప జిల్లా బద్వేలుకు చెందిన రవికుమార్ బెంగళూరులో ఉన్న సమయంలో తనను ప్రేమించాడని తెలిపింది.

2001లో తనను పెళ్లి చేసుకుని, 2002లో మగబిడ్డ జన్మించేంత వరకు అన్యోన్యంగానే ఉన్నామని తర్వాత కట్నం కోసం రవికుమార్ వేధింపులకు గురిచేశాడని కళావతి వాపోయారు. అయితే ఆ తర్వాత తనకు చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఆయన ఆచూకీ కోసం పలు స్టేషన్‌లలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కన్నీటిపర్యంతమయ్యారు.

తనకు జరిగిన అన్యాయంపై రవికుమార్‌ను ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని తనకు న్యాయం చేయాలంటూ కడప ప్రభుత్వ చెల్లింపులు, గణాంకాల శాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆమె ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు ఇక్కడే వుంటానని కళావతి స్పష్టం చేశారు.