కాపుల రిజర్వేషన్లు రాష్ట్రం పరిధిలో లేవు.... కేంద్రమే రిజర్వేషన్లను అమలు చేయాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  ప్రకటన చేయడంపై కాపులు ఆగ్రహం వ్యక్తం చేశారు


కిర్లంపూడి: కాపుల రిజర్వేషన్లు రాష్ట్రం పరిధిలో లేవు.... కేంద్రమే రిజర్వేషన్లను అమలు చేయాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రకటన చేయడంపై కాపులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనను నిరసిస్తూ కిర్లంపూడి మండంలోని గోనేడ వద్ద కాపు కార్యకర్తలు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు అడ్డు తగిలారు. ప్ల కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు, జగన్ సెక్యూరిటీ సిబ్బంది నిరసనకారులను బయటకు పంపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడి మండలంలోకి ఆదివారం నాడు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది.ఈ పాదయాత్రకు కాపులు అడ్డు తగిలారు. కాపుల రిజర్వేషన్ల విషయమై వైఎస్ జగన్ చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

ఈ మేరకు ప్లకార్డులు ప్రదర్శించి జగన్ పాదయాత్రను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో జగన్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు కాపు ఆందోళన కారులను అడ్డుకొన్నారు. పాదయాత్రకు ఇబ్బందులు కలగకుండా ఆందోళనకారులను పంపించివేశారు.

ఈ సమయంలో పోలీసులకు, జగన్ సెక్యూరిటీ సిబ్బందికి మధ్య తోపులాట చోటుచేసుకొంది. కాపు రిజర్వేషన్ల విషయమై జగన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

ఈ వార్తలు చదవండి

1.కాపు రిజర్వేషన్: మీకు మేం ఎందుకు ఓట్లెయ్యాలి:జగన్‌‌కు ముద్రగడ కౌంటర్

2.కాపులకు అన్యాయం చేసే నైజం జగన్‌ది: కళా వెంకట్రావు