కనుమురు రఘు రామ కృష్ణంరాజు: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం..
Kanumuru Raghu Rama Krishna Raju Biography: వైసీపీ రెబల్ ఎంపీ కనుమురు రఘు రామ కృష్ణంరాజు.. ఆయనను ముద్దుగా ఆర్ఆర్ఆర్ అని పిలుస్తారు. ఆయన రాజకీయ నాయకుడే కాదు సక్సెస్ పుల్ బిజినెస్ మ్యాన్. ప్రస్తుతం ఏపీలోని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుండి 17 వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ, వైసీపీ ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు ఎండగడుతుంటారు. ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు తెలుసుకుందాం.
Kanumuru Raghu Rama Krishna Raju Biography: వైసీపీ రెబల్ ఎంపీ కనుమురు రఘు రామ కృష్ణంరాజు.. ఆయనను ముద్దుగా ఆర్ఆర్ఆర్ అని పిలుస్తారు. ఆయన రాజకీయ నాయకుడే కాదు సక్సెస్ పుల్ బిజినెస్ మ్యాన్. ప్రస్తుతం ఏపీలోని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుండి 17 వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ, వైసీపీ ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు ఎండగడుతుంటారు. ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు తెలుసుకుందాం.
బాల్యం, కుటుంబ నేపథ్యం
వైసీపీ రెబల్, నరసాపురం లోక్ సభ ఎంపీ రఘురామకృష్ణం రాజు 1962 మే 14న విజయవాడలో సత్యనారాయణ రాజు , అన్నపూర్ణ దంపతులకు జన్మించారు. తండ్రిగారు సత్యనారాయణ రాజు వ్యాపారవేత్త, ఆయన తల్లి అన్నపూర్ణ అప్పట్లోనే ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఆమె విజయవాడకు చెందిన వాళ్ళ ఫార్మ కంపెనీలో ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టారు. కృష్ణంరాజు గారికి ఇద్దరు తమ్ముళ్లు (సుబ్బరాజు, మధుసూదన్ వర్మ). రఘురామకృష్ణ రాజు గారి తండ్రి స్వగ్రామం భీమవరం.
అయినప్పటికీ కృష్ణంరాజు గారు పుట్టింది పెరిగింది విజయవాడలో వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లోనే. కృష్ణంరాజు చెన్నైలోని సైంటిఫిక్ స్కూల్లో మూడో తరగతి వరకు చదవారు. తర్వాత విజయవాడ మున్న కాన్వెంట్లో మాంటిసోరి స్కూల్లో విద్యను అభ్యసించారు. తర్వాత విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్ ఎంపీసీలో చేరారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీఫార్మసీ, అదే యూనివర్సిటీ నుంచి ఎంఫార్మసీ పూర్తి చేశారు. ఆయన ఎంఫార్మసీలో గోల్డ్ మోడలిస్టు. కేవలం చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ బాగా చురుగ్గా ఉండేవారు.
తనకు ఎంతో ఇష్టమైన బ్యాట్మెంటన్ క్రీడకు సంబంధించి ఒక సంఘానికి వైస్ ప్రెసిడెంట్ గా పని చేశారు. ఆయన తల్లి తరఫున తాతగారు కుటుంబానికి మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1980లో తన దగ్గరి బంధువైన రమాదేవి గారిని వివాహం చేసుకున్నరామరాజు. వారికి ఇద్దరు సంతానం. కుమారుడు భరత్, కుమార్తె ఇందిర ప్రియదర్శిని. ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఎంబీఏ చేశారు. ఆయన తన కుమార్తెను వైయస్సార్ స్నేహితుడు కేవీపీ రామచంద్రా ఇంటికి కోడలుగా పంపించారు.
రాజకీయ ప్రవేశం
మొదటి నుండే నెహ్రూ కుటుంబంతో రఘురాం కృష్ణంరాజు కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. దీనివలన కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడుగా ఉండేవారు రఘురామకృష్ణరాజు. అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి తో రఘురామకృష్ణంరాజుకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ కారణంగానే వైయస్ చనిపోయిన తదునంత పరిణామాల నేపథ్యంలో జగన్ కు మద్దతుగా నిలిచారు.
జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ, జగన్ తో అభిప్రాయ భేదాలు కారణంగా 2014 ఎన్నికలకు ముందు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ నుంచి నరసాపురం ఎంపీ టికెట్ ఆశించగా అధిష్టానం ఆయనకు మొండి చేతి చూపించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగా.. తనకున్న వ్యాపార కారణాల రీత్యా తెలుగుదేశం పార్టీ జెండా పట్టాల్సి వచ్చింది.
వాస్తవానికి రామకృష్ణంరాజు యాక్టివ్ పాలిటిక్స్ లో అంతగా ఇమడలేకపోయారు. దీంతో టీడీపీకి గుడ్ బాయ్ చెప్పేశారు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేయాలని భావించిన ఆయన తిరిగి జగన్ కలిసి వైసీపీలో చేరారు. అనుకున్నట్టుగానే ఎంపీ టికెట్ సాధించారు. ఈ క్రమంలోనే తమ సమీప ప్రత్యర్థైన టిడిపి అభ్యర్థి బీబీ శివరామరాజు పై 30 వేలకు పైగా మెజార్టీ ఓట్లతో విజయం సాధించారు.
వైసీపీ రెబల్ ఎంపీ
అయితే.. తదనంతరం జరిగిన పరిణామాలలో వైసిపి రెబల్ ఎంపీగా మారారు. పార్లమెంట్లో సైతం వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శించారు. అలాగే జగన్ వ్యతిరేకంగా టీవీ డిబేట్లో మాట్లాడటం చూసేఉంటాం. ప్రధానంగా తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా రాజు నవంబర్ 2019లో మాట్లాడినప్పుడు వారి మధ్య విభేదాలు బహిరంగమయ్యాయి.
తన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి అనేక ప్రభుత్వ పథకాల్లో కుంభకోణాలు చేశారని ఆరోపించారు. జులై 2020లో రాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలే కారణమని పేర్కొంటూ రాజును ఎంపీగా అనర్హులుగా ప్రకటించాలని YSRCP లోక్‌సభ స్పీకర్‌కి విజ్ఞప్తి చేసింది. అక్టోబర్ 2020లో భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో మత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ రాజు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
వ్యాపారాలు
రఘురామ కృష్ణంరాజు వారసత్వ ఆశలతో పాటు తనకున్న తెలివి, ప్రతిభతో కంపెనీలో స్థాపించి బడా వ్యాపారవేత్తగా జాతీయస్థాయిలో పేరు సంపాదించారు. ఇన్ భారత్ పవర్ లిమిటెడ్ అనే పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ కు ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇది మొదట కనుమూరు హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 1995లో ఫిబ్రవరి 17వ తారీఖున ఏర్పాటు అయింది. తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్ తయారీ స్టార్ట్ చేశారు. 1997-98 మధ్యలో ఆరు మెగావాట్లు కెపాసిటీ ఉన్న సార్టప్ ప్రారంభించారు.
ఆ తరువాత తమిళనాడులో మూడు పవర్ ప్లాంట్లను, ఒరిస్సాలో 700 వాట్స్ ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉన్న ఒక్క పవర్ ప్లాంట్ స్థాపించారు. ఇక 1999 లోనే ఇన్ ప్రాజెక్టు ఫాస్ట్ 206 కోట్లు, 2000లో కృష్ణాజిల్లాలో ఫారిన్ కోలాబరేషన్తో గ్యాస్ ప్లాంట్ స్టార్ట్ చేశారు. అప్పటికి దాని విలువ 80 కోట్లు . లిమిటెడ్ కంపెనీకి 2006 వరకు చెప్పుకోదగ్గ భారీ ప్రాజెక్ట్ ఏమీ లేవు. కంపెనీ అధికృతం పెట్టుబడి 2005లో రెండు లక్షల రూపాయలు కాక 2006లో ఒకేసారి పెట్టుబడి 20 కోట్లకు చేరింది. ఆ తర్వాత కంపెనీలోకి పెట్టుబడి మొదలయ్యాయి.
మారిషస్ దేశంలోని స్టెటజీస్ ఎనర్జీస్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ నుంచి భారీ స్థాయిలో అప్పట్లో రఘురాం కృష్ణంరాజుకు పెట్టుబడి వచ్చాయి. దాంతో ఆయన వ్యాపార సామ్రాజ్యం విదేశాలు కూడా పాకింది. అలాగే ఇండియన్ ఓషన్ లోని కానీ మంథన్ అనే ప్రాంతంలోని బొగ్గు గనువులు సైతం చేదికించుకున్నారు రఘురామకృష్ణ రాజు. ఈ బొగ్గు గనుల ద్వారా 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా 7800 కోట్లతో పవర్ ప్లాంట్లను ప్రారంభించాలని భావించారు. కానీ అప్పటి మార్కెట్ పరిస్థితులు అంచనా వేసుకున్న రఘురాం కృష్ణంరాజు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అలాగే బ్యాంకు నుండి 1000 కోట్లు అప్పు తీసుకుని ఎగవేశారని ఆరోపణలపై సిపిఐ ఆయన ఇంటిపై దాడి నిర్వహించింది
వివాదాలు
ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్ డైరెక్టర్‌లుగా ఉన్న రాజు , అతని కుటుంబ సభ్యులపై మార్చి 2021లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కేసు నమోదు చేసింది. అలాగే.. రుణం తీసుకున్న కంపెనీ, దాని డైరెక్టర్లు మరియు పబ్లిక్ సర్వెంట్లు కుట్ర పన్ని, మోసానికి పాల్పడ్డారని, బ్యాంకు నిధులను ₹ 237.84 కోట్ల స్వాహా చేశారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
2021 ఏప్రిల్‌లో జగన్ మోహన్ రెడ్డికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2012 నుంచి బెయిల్‌పై ఉన్న ముఖ్యమంత్రి బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆరోపించారు.
14 మే 2021న మత సామరస్యానికి భంగం కలిగించడం, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని ప్రముఖులపై అసత్య ఆరోపణలు చేయడంపై ఆంధ్ర ప్రదేశ్ నేర పరిశోధన విభాగం (CID) రాజును అరెస్టు చేసింది. ఆ తరువాత మే 21న భారత సుప్రీం కోర్ట్ అతనికి లక్షరూపాయాల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.
అభిరుచులు
రఘురామకృష్ణం రాజుకు కోడిపందాలు అంటే మహా పిచ్చి. కోడిపుంధాల కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని ఎలా అడ్డుకుంటారని వాదించారు. అంతేకాకుండా ఆయనకు గోల్ఫ్ ఆడటమంటే.. చాలా ఇష్టం. ప్రతి రోజు గోల్ఫ్ ఆడుతారు. ఆయనకు సినిమాలు చాలా ఇష్టం. తెలుగు సినిమా పరిశ్రమంలో ఎంతో మంది సినీ ప్రముఖులతో ఈయన సన్నిహితంగా ఉంటారు.
- Kanumuru Raghu Rama Krishna Raju Age
- Kanumuru Raghu Rama Krishna Raju Biography
- Kanumuru Raghu Rama Krishna Raju Family Background
- Kanumuru Raghu Rama Krishna Raju Life
- Raghu Rama Krishna Raju Assets
- Raghu Rama Krishna Raju Biography
- Raghu Rama Krishna Raju Educational Qualifications
- Raghu Rama Krishna Raju Family
- Raghu Rama Krishna Raju Life Story
- Raghu Rama Krishna Raju Real Story
- Raghu Rama Krishna Raju Victories
- Raghu Rama Krishna Raju profile