పోలవరంపై కన్నా సంచలన వ్యాఖ్యలు

First Published 11, Jul 2018, 9:19 PM IST
Kanna says State govt is no way concerned with Polavaram
Highlights

పోలవరం ప్రాజెక్టుపై బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదని ఆయన బుధవారం అన్నారు. 

రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టుపై బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదని ఆయన బుధవారం అన్నారు. 

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బాకీ లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం రాష్ట్రానికి సంబంధం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కేవలం సమన్వయకర్త మాత్రమేనని ఆయన అన్నారు.

పోలవరాన్ని కేంద్రం గడువులోగా నిర్మించి తీరుతుందని ఆయన చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏంృమిటని బీజేపీ నేత ప్రశ్నించారు. వాస్తవాలు చెప్తున్నామనే తమపై దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 

ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు గుండె వంటిదని, అలాంటిది రాజకీయాల కోసం గుండెను పిసికేయవద్దని  ఆయన అన్నారు.

loader