చంద్రబాబు చెప్పారు, అయినా డీల్ విఫలం: కన్నా దారి అటే...

Kanna Lakshminarayana was decided to join in YCP
Highlights

బిజెపికి రాజీనామా చేసిన కన్నా లక్ష్మినారాయణ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ చేరడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

గుంటూరు: బిజెపికి రాజీనామా చేసిన కన్నా లక్ష్మినారాయణ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ చేరడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కన్నాను తెలుగుదేశం పార్టీలోకి అహ్వానించడానికి ప్రయత్నాలు జరిగాయి. తొలుత ఆ వైపు కన్నా ఆలోచించారని అంటున్నారు. 

కన్నాతో డీల్ కోసం మాట్లాడిన ఓ మంత్రి ఆ తర్వాత దాన్ని వదిలేశారు. దాంతో కన్నా లక్ష్మినారాయణ తన దారి తాను చూసుకోవడానికి సిద్ధపడ్డారు. చంద్రబాబు పచ్చజెండా ఊపినా టిడీపీ ముఖ్య నేతలు సకాలంలో స్పందించకపోవడం కన్నాను వారు వదిలేసుకోవాల్సి వచ్చింది. 

ఐదు సార్లు శాసనసభకు ఎన్నికైన కన్నా లక్ష్మినారాయణ గుంటూరు జిల్లాలో బలమైన నేతగా కొనసాగుతున్నారు. 2014లో కాంగ్రెసు తరరఫున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దానితర్వాత ఆయన బిజెపిలో చేరారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన బిజెపికి రాజీినామా చేశారు. 

తనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పి అందుకు నిరాకరించడంతో ఆయన మనస్తాపానికి గురై బిజెపిని వీడాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెసు నాయకులు అప్రమత్తమై కన్నాతో చర్చలు జరిపారు. కన్నాకు పెదకూరపాడు అసెంబ్లీ టికెట్ ఇవ్వడంతో ఆయన అనుచరుడికి శాసనసభ టికెట్ ఇస్తామని వైసిపి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

దాంతో ఆయన వైసిపిలో చేరడానికి నిర్ణయించుకున్నారు. ఆయన ఇప్పటికే వైసిపిలో చేరాల్సి ఉండింది. అయితే, అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో అది కాస్తా వాయిదా పడింది. ఈ సమయంలో మరోసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నాతో మాట్లాడినట్లు చెబుతున్నారు. తాను టీడీపిలోకి రావడానికి సిద్ధంగానే ఉన్నానని, అయితే తనకు ఇచ్చే హామీలేమిటో చెప్పాలని ఆయన అడిగినట్లు చెబుతున్నారు. 

కన్నాతో మాట్లాడిన మంత్రి ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారని అంటున్నారు. మరో మంత్రి కూడా కన్నాతో మాట్లాడారని, ఆయన కూడా నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఆయన వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నారని అంటున్నిారు. 

ఈ వాతావరణంలోనే బిజెపి నేత రామ్ మాధవ్ కన్నా లక్ష్మినారాయణతో మాట్లాడినట్లు చెబుతున్నారు. దాన్ని ఆసరా చేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు మరోసారి కన్నాతో సంప్రదింపులు ప్రారంభించారని అంటున్నారు. అయితే, కన్నా మాత్రం వైసిపిలో చేరడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 

loader