ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. 

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుబ్ బై చెప్పనున్నారనే వార్తలు గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలను గతంలో పలువురు బీజేపీ నేతలు ఖండించారు. అయితే తాజాగా కన్నా లక్ష్మినారాయణ ఈ రోజు తన ముఖ్య అనుచరులతో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ మార్పుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఏపీ బీజేపీలో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ మారాలని కన్నా లక్ష్మీనారాయణ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేతగా ఉన్న కన్నాను పార్టీలో ఖాళీగా ఉంచుతున్నారని.. ఎలాంటి గౌరవం లేని చోట ఉండటం వ్యర్థమనే ఆలోచనలో ఆయన ఉన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

అయితే ఈ రోజు సమావేశం తర్వాత కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మార్పు విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీని వీడితే.. ఆయన ఏ పార్టీలో చేరాలనేది ఈ రోజు తన అనుచరులతో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.