ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కన్నా

First Published 26, May 2018, 11:47 AM IST
Kanna Lakshminarayana  take charge as BJP chief today
Highlights

విజయోత్సవ సభలో బాధ్యతలు చేపట్టిన కన్నా

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించారు. శనివారం గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్‌లో నరేంద్రమోదీ నాలుగేళ్ళ పాలనపై విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్, యూపీ వైద్య మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, సోము వీర్రాజు, పురంధేశ్వరి, జీవీఎల్ నరసింహారావు, హరిబాబు, గోకరాజు గంగరాజు, కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, కృష్ణంరాజు, విష్ణుకుమార్రాజు, ఆకుల సత్యనారాయణ, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

loader