బీజేపీని వీడను.. జనసేనలో చేరుతున్నాననేది ప్రచారం మాత్రమే.. కన్నాలక్ష్మీనారాయణ
తాను బీజేపీని వీడనని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన శివ ప్రకాష్ జీతో భేటీ అయ్యారు.

విజయవాడ : శివ ప్రకాష్ జీతో భేటీ నేపథ్యంలో బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ విజయవాడ సిటీ కార్యాలయానికి చేరుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు పై గత కొంతకాలం గా అసంతృప్తి తో ఉన్నాడు. ఇటీవల జిల్లాల అధ్యక్షులు మార్పుపై సోము వీర్రాజు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని కన్నా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బిజెపిలో ఉండలేక పార్టీ కూడా మారతారనే ఊహాగానాలు వస్తున్నాయి.
దీంతో బిజెపి అధిష్టానం రంగంలోకి దిగింది. కన్నాతో చర్చించాలని శివ ప్రకాష్ జీ కి ఆదేశించింది. ఈ క్రమంలోనే శుక్రవారం శివ ప్రకాష్ జీ తో కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. రాష్ట్రం లో బిజెపి పరిస్థితి, నాయకుల పని తీరుని శివ ప్రకాష్ జీకి వివరించారు.
కన్నాకు బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రకాష్ ఫోన్: రేపు విజయవాడలో భేటీ
శివ ప్రకాష్ జీతో కన్నా లక్ష్మీనారాయణ రెండూ గంటల పాటు సమావేశం అయ్యారు. ఏపి బీజేపీలో కొందరి నేతలపై శివ ప్రకాష్ జీకి కన్నా లక్ష్మీనారాయణ పిర్యాదు చేశారు. ఈ క్రమంలో బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఏపిలో నెలకొన్న రాజకీయ పరిణామాలను శివ ప్రకాష్ జీకి వివరించాను. ఏపి బిజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా వివరించాను.
పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుంటున్న నేతలు బీజేపీలో ఉన్నారు. నేను బిజెపి వీడను మనోహర్ నాకు మంచి సన్నిహితుడు. జనసేనలో చేరుతున్నాను అనేది ప్రచారం మాత్రమే. నాదెండ్ల మనోహర్ నన్ను చాలాసార్లు కలిసాడు. నన్ను బుజ్జగించడం కోసం శివ ప్రకాష్ జి నన్ను కలవలేదు.బీజేపీలో జరిగిన అవమానాల వల్ల పార్టీలోని నేతలు రాజీనామాలు చేస్తున్నారు... అని చెప్పుకొచ్చారు.