చంద్రబాబు రాష్ట్ర ద్రోహి అని, రాజధాని నిర్మాణం పేరుతో ఇటుకల కోసం తీసుకున్న డబ్బు ఏం చేశారంటూ ప్రశ్నించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబుది ఎప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతమేనని ఆయన మండిపడ్డారు.
బీజేపీతో ఉంటూనే, రాహుల్‌తో చంద్రబాబు సంప్రదించారని.. 2014లో కాంగ్రెస్సే ఏపీకి అన్యాయం చేసిందని చెప్పిన చంద్రబాబు, 2019 నాటికి కాంగ్రెస్‌నే మంచిదంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర ద్రోహి అని, రాజధాని నిర్మాణం పేరుతో ఇటుకల కోసం తీసుకున్న డబ్బు ఏం చేశారంటూ ప్రశ్నించారు.
ఇప్పుడు బాండ్ల ద్వారా సేకరించిన రూ.2వేల కోట్లను ఏం చేస్తారో చూడాలంటూ పేర్కొన్నారు. రాజధానికి కేంద్రం ఇచ్చిన నిధులతో ఒక్క దానికీ శంకుస్థాపన చేయలేదని, రాజధాని మాస్టర్ ప్లాన్ కూడా కేంద్రానికి ఇవ్వలేదని అన్నారు.
