కన్నాకు "ఆ మూడింటిలో" అనుభవం ఎక్కువేమో..?

kala venkatrao fires on kanna lakshminarayana
Highlights

కన్నాకు "ఆ మూడింటిలో" అనుభవం ఎక్కువేమో..?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావ్. అమరావతిలో ఆయన మాట్లాడుతూ... బీజేపీ కొత్త అధ్యక్షుడు విమర్శలు, ఆరోపణలు చేయడమే రాజకీయం అనుకుంటున్నారని మండిపడ్డారు.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి చేయాల్సిన కనీస పనులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వెంకట్రావు ఆరోపించారు.. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ గెలుస్తుందని అంటున్న కన్నా.. ఏయే స్థానాల్లో గెలుస్తారో.. ఎవరు గెలుస్తారో చెప్పలని కళా వెంకట్రావ్ ప్రశ్నించారు.. అవినీతి, తప్పుడు కేసులు, పోలీస్ స్టేషన్ల ఇవే కన్నాకు ఎక్కువగా గుర్తొస్తున్నాయని... గతంలో ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు వీటిలో బాగా అనుభవం ఉందేమోనని ఎద్దేవా చేశారు.. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ప్రశ్నిస్తోందని.. దీనికి కారణం ఏంటో బీజేపీ నేతలు ఇంటింటికి తిరిగి సమాధానం చెప్పాలని వెంకట్రావ్ డిమాండ్ చేశారు.

loader