కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన ఉద్రిక్తతల మధ్య ఆసక్తికరంగా సాగింది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన 14 మంది జనసేన కార్యకర్తలను ఆయన మంగళవారం తన పర్యటనలో పరామర్శించారు. 

దాడిలో గాయపడిన ఓ జనసైనికుడిని కాలును పవన్ కల్యాణ్ పట్టుకుని పరిశీలించారు. దాడిలో కాలికి గాయమైన ఫ్యాన్ వద్ద అతను కూర్చుని కాలు పట్టుకుని గాయాన్ని పరిశీలించారు. దాడి ఘటనను, ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలను జనసేన కార్యకర్తలు ఆయనకు వివరించారు. 

Also Read: పాలెగాళ్ల రాజ్యం, దాడి చేసి మాపైనే కేసులా: పవన్

పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా కాకినాడలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. కాకినాడలోని ప్రధాన రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్ల వల్ల ఇబ్బందులు పడిన వాహనదారులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఆదివారంనాడు ఈ నెల 12వ తేదీన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. 

Also Read: కాకినాడలో నానాజీని పరామర్శించిన పవన్ కళ్యాణ్

ద్వారంపూడి ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ద్వారంపూడి అనుచరులు వారిపై దాడి చేశారు. దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్ కల్యాణ్ మంగళవారంనాడు పరామర్శించారు.