కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు కొనసాగుతున్నారు. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో కాకినాడలోని కొంత ప్రాంతం, చుట్టుపక్కల గ్రామాలను కలిపి ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటుచేసారు. ఇక్కడ టిడిపి, వైసిపి లతో పాటు జనసేన పార్టీ కూడా బలంగా వుంది. 

కాకినాడ రూరల్ రాజకీయాలు : 

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మొదట ఎగిరింది ప్రజారాజ్యం జెండానే. నియోజకవర్గ ఏర్పాటుతర్వాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కురసాల కన్నబాబు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసిపి గూటికి చేరిన కన్నబాబు 2019 లో మళ్ళీ ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో వ్యవసాయ మంత్రి దక్కించుకున్నాడు. 

ఇదిలావుంటే 2014లో కాకినాడ రూరల్ సీటు టిడిపి కైవసం చేసుకుంది. టిడిపి నుండి పోటీచేసిన అనంతలక్ష్మి పిల్లి విజయం సాధించారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాకినాడ రూరల్ నుండి జనసేన పోటీకి దిగింది. 

కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. కాకినాడ రూరల్ 
2. కరప
3. కాకినాడ పట్టణంలోన 66 నుండి 70 వార్డులు 

కాకినాడ అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌- 2,49,109

పురుషులు - 1,24,779
మహిళలు ‌- 1,24,310

కాకినాడ రూరల్ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మళ్లీ కురసాల కన్నబాబు పోటీచేసే అవకాశాలున్నాయి. అయితే ఆయనను కాకినాడ ఎంపీగా పోటీలో నిలపాలని వైసిపి చూస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లే ఈ సీటును వైసిపి పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. కానీ కన్నబాబు మాత్రం తిరిగి కాకినాడ రూరల్ నుండే పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. 

జనసేన అభ్యర్థి :

పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ సీటు జనసేనకు దక్కింది. ఇక్కడినుండి పంతం నానాజీ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే జనసేన ప్రకటించింది. గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీచేసి మంచి ఓట్లు సాధించింది. 

కాకినాడ రూరల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

కాకినాడ రూరల్ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,65,338

వైసిపి - కురసాల కన్నబాబు - 74,068 (40 శాతం) ‌ - 8,789 ఓట్ల మెజారిటీతో విజయం

టిడిపి - అనంతలక్ష్మి పిల్లి - 65,279 (35 శాతం) - ఓటమి 

జనసేన పార్టీ - పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) ‌- 40,001 (22 శాతం) 

కాకినాడ రూరల్ అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,84,487 (74 శాతం)

టిడిపి - లక్ష్మి పిల్లి - 61,144 (36 శాతం) - 9,048 ఓట్ల మెజారిటీతో విజయం

వైసిపి - శ్రీనివాస వేణుగోపాల కృష్ణ - 52,096 (31 శాతం) - ఓటమి