కాకినాడ: రెండు వేల నోట్లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయనుందన్న తప్పుడు ప్రచారాన్నే తమ మోసానికి పావుగా వాడుకుంది ఓ నకిలీ కరెన్సీ ముఠా. ఇలా అమాయకుల నుండి భారీ మొత్తంలో నగదును కాజేయాలని ప్రయత్నిస్తున్న ఓ ముఠాను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. 

కాకినాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి కాకినాడకు చెందిన  నాగ ప్రసాద్ అనే వ్యక్తిని ఇటీవల ఓ నకిలీ కరెన్సీ మఠా కలిసింది. కేంద్రం 2 వేల నోట్లను రద్దు చేయనున్న నేపధ్యంలో తమ దగ్గర ఉన్న రెండు వందల కోట్లను తక్కువకే ఇస్తామంటూ మోసం చేసేందుకు యత్నించింది. 90 లక్షల రూపాయల విలువైన 5 వందల రూపాయల నోట్లు ఇస్తే  కోటి రూపాయిల విలువైన  2 వేల రూపాయల నోట్లు ఇస్తామని నమ్మించే ప్రయత్నం చేశారు ఈ ముఠా సభ్యులు. 

read more  ప్రేమ పెళ్లి.. భార్యను నదిలోకి తోసేసిన భర్త

నాగ ప్రసాద్ ను నమ్మించేందుకు రెండు వేల రూపాయల నోట్లను నిల్వ ఉంచినట్లు ఓ వీడియోను చూపించారు. అయితే వారి వ్యవహారశైలిపై అనుమానం వచ్చి నాగ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన కాకినాడ పోలీసులు విశాఖ జిల్లాకు చెందిన నలుగురు ముఠా సభ్యులతో పాటు వారికి సహకరిస్తున్న కాకినాడకు చెందిన మరొక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.