Asianet News TeluguAsianet News Telugu

కైకలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

ఏలూరు జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో ఎలక్షన్ పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో వున్న రాజకీయ పార్టీలన్ని కైకలూరులో బలంగా వున్నాయి. ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేనలే కాదు కాంగ్రెస్, బిజెపి లకు కూడా కైకలూరుపై పట్టుంది. గత ఐదు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే వరుసగా ఓ స్వతంత్ర అభ్యర్ధితో పాటు కాంగ్రెస్, టిడిపి, బిజెపి, వైసిపి లు కైకలూరులో విజయం సాధించాయి. దీంతో ఈసారి ఈ అసెంబ్లీలో గెలుపు ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. 

Kaikalur assembly elections result 2024 AKP
Author
First Published Mar 20, 2024, 3:57 PM IST

కైకలూరు రాజకీయాలు : 

మాజీ మంత్రి, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు కైకలూరు ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేసారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ హవా, తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగిన రోజుల్లోనూ కైకలూరు కాంగ్రెస్ జెండా ఎగిరేసారు బాపిరాజు. ఇలా 1978, 1983,1985,1989 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుపొంది సత్తాచాటారు కనుమూరి బాపిరాజు. ఇలా కైకలూరు రాజకీయాల్లో చాలాకాలం బాపిరాజు హవా సాగింది. 

ఆవిర్భావం తర్వాత కేవలం ఒకే ఒకసారి కైకలూరులో టిడిపి గెలిచింది. నియోజకవర్గ ఏర్పాటునుండి 2009 వరకు కైకలూరు కాంగ్రెస్ దే గెలుపు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో జయమంగళ వెంకటరమణ టిడిపి నుండి గెలిచారు. 2014 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కామినేని శ్రీనివాస్, 2019 ఎన్నికల్లో దూలం నాగేశ్వరరావు కైకలూరులో గెలిచారు. ఇలా కైకలూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం వుంది.    

కైకలూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. మండవల్లి
2. కలిదిండి
3. ముదినెపల్లి
4. కైకలూరు 

కైకలూరు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) -  1,95,844
పురుషులు -  97,733
మహిళలు ‌-  98,105

కైకలూరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కైకలూరులో వైసిపి జెండా ఎగరేసిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును మరోసారి బరిలోకి దింపుతోంది వైసిపి. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చిన వైసిపి కైకలూరులో మాత్రం ఆ పని చేయలేదు.  అంటే నాగేశ్వరరావుపై వైసిపి అధినేత నమ్మకంగా వున్నారని అర్థమవుతుంది. 

టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి :

పొత్తులో భాగంగా కైకలూరు సీటును టిడిపి వదులుకుంది. ఇక్కడ బిజెపి పోటీ చేస్తుందట. అధికారికంగా ప్రకటించకున్నా ఆంధ్ర ప్రదేశ్ బిజెపి మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కైకలూరు నుండి పోటీ చేయనున్నట్లు సమాచారం. 

కైకలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

కైకలూరు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,72,366 (88 శాతం) 

వైసిపి - దూలం నాగేశ్వరరావు - 82,128 ఓట్లు (47 శాతం) - 9,357 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - జయమంగళ వెంకటరమణ - 72,771 (42 శాతం) - ఓటమి

జనసేన పార్టీ - బుసబోయిన వెంకటేశ్వరరావు   - 10,738 (6 శాతం)

కైకలూరు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,63,739 (86 శాతం)

బిజెపి - కామినేని శ్రీనివాస్ - 88,092 (53 శాతం) ‌-  21,571 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - రామ్ ప్రసాద్ ఉప్పల  - 66,521 (40 శాతం) - ఓటమి 


 

Follow Us:
Download App:
  • android
  • ios