బ్రేకింగ్ న్యూస్ : వైసిపిలోకి కడపల సోదరులు

First Published 3, Apr 2018, 11:39 AM IST
Kadapala brothers joining in ycp
Highlights
సోదరులిద్దరిది అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గం.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలైన కడపల సోదరులు బుధవారం వైసిపిలో చేరుతున్నారు. గుంటూరు జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసిపి కండువా కప్పుకోనున్నారు. సోదరులిద్దరిది అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గం. జిల్లాలో కడపల సోదరులది గట్టి రాజకీయ నేపధ్యమున్న కుటుంబమే.

ఇప్పటి వరకూ కాంగ్రెస్ లో ఉన్న సోదరులు ఎన్నికలకు ముందు వైసిపిలోకి చేరుతుండటం గమనార్హం. రానున్న ఎన్నికల్లో పుట్టపర్తి నుండి శ్రీకాంత్ రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టిక్కెట్టు విషయమై జగన్ నుండి గట్టి హామీ పొందిన తర్వాతే సోదరులిద్దరూ వైసిపిలోకి చేరుతున్నారట.  గతంలో పిఆర్పి తరపున హిదుపురంలో శ్రీకాంత్ రెడ్డి పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే

loader