కడపలో వేడెక్కిన రాజకీయం.. జగన్ మాష్టర్ ప్లాన్

kadapa ycp MLA's want to resign for steel plant
Highlights

ముక్కుమ్మడి రాజీనామాలకు సిద్ధమౌతున్న వైసీపీ ఎమ్మెల్యేలు

రాజకీయాలతో కడప జిల్లా వేడెక్కింది. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ఇప్పటికే  టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. వీరు దీక్ష చేపట్టి నేటికి 8 రోజులయ్యింది. అయితే.. రానున్నది ఎన్నికల కాలం. ఇలాంటి సమయంలో టీడీపీ నేతలు ఇలా దీక్షలు చేపడుతుండటం వారికి అనుకూలంగా మారే అవకాశం లేకపోలేదు. 

అందుకే  టీడీపీ నేతల వ్యూహ్యాన్ని దెబ్బకొడుతూ జగన్ మాష్టర్ ప్లాన్ వేశారు. జిల్లాకు చెందిన తమ ఏడుగురు ఎమ్మెల్యేల చేత ముకుమ్మడి రాజీనామాలు చేయించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు దమ్ము ఉంటే   టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

తమ ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రజల దృష్టిని టీడీపీ వైపు మళ్లకుండా వైసీపీ వైపు మరల్చేలా పథకం వేశారు. ఇదిలా ఉండగా.. సీఎం రమేష్, బీటెక్ రవిల నిరాహార దీక్షను వీలైనంత ఎక్కువగా క్యాష్ చేసుకోవాలని చూస్తోంది అధికార పార్టీ. వారిద్దిరికీ సంఘీభావం తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు జరపాలని నిర్ణయించారు.

ఈ ర్యాలీలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించాలని టీడీపీ ప్రభుత్వం చూస్తోంది. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల ఎత్తు పై ఎత్తులతో కడప జిల్లా   వేడెక్కిపోతోంది. 

loader