కడప జిల్లా జైలు సూపరింటెండ్ గా ఉన్న వరుణా రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వరుణారెడ్డిన బంగోలుకు బదిలీ చేస్తూ మంగళవారం నాడు ఉత్తర్వులిచ్చింది.

కడప: Kadapa జిల్లా ఇంచార్జీ Jail Superintendent గా ఉన్న Varuna Reddy ని Ongole జైలుకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మొద్దు శీనును ఓం ప్రకాష్ అనే వ్యక్తి హత్య చేశాడు. అయితే ఈ సమయంలో అనంతపురం జైలులో వరుణారెడ్డి జైలు సూపరింటెండ్ గా ఉన్నారు.

ప్రస్తుతం YS Vivekananda Reddy హత్య కేసులో నిందితులుగా ఉన్నవారంతా కడప జైలులోనే ఉన్నారు. 12 రోజుల క్రితం కడప జైలు సూపరింటెండ్ గా వరుణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను జైల్లోనే హత్య చేసేందుకే వరుణారెడ్డిని కడప జైలు సూపరింటెండ్ గా బదిలీ చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయమై TDP చీఫ్ చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ విషయమై CBIకి కూడా లేఖ రాశారు. ఈ తరుణంలోనే వరుణారెడ్డిని కడప నుండి ఒంగోలు జైలుకు మంగళవారం నాడు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Moddu Seenu అనంతపురం జైలులో హత్యకు గురైన సమయంలో వరుణారెడ్డి శాఖపరమైన విచారణను ఎదుర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యంతో పాటు పర్యవేక్షణ లోపం , భద్రతాపరమైన అంశాలు పట్టించుకోని కారణంగానే మొద్దుశీను జైల్లోనే హత్యకు గురయ్యాడని ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వరుణారెడ్డి పై పనిష్ మెంట్ ఉత్తర్వులు ఇచ్చారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉత్తర్వులను కొట్టివేశారు. 

తనపై విధించిన పనిష్‌మెంట్ ను కొట్టివేయాలని వరుణా రెడ్డి 2019 ఫిబ్రవరి 4న ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకొన్నారు. జగన్ సర్కార్ ఈ ఉత్తర్వులను కొట్టివేసింది. 2008 నవంబర్ 10 నుండి 2010 ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. సస్పెన్షన్ లో ఉన్న కాలాన్ని కూడా డ్యూటీలోనే ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం 2019 ఆగష్టు 29న హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులిచ్చారు. 

వరుణారెడ్డిని కడప జిల్లా జైలు సూపరింటెండ్ గా బదిలీ చేయడంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఈ నెల 12న తీవ్ర విమర్శలు చేశారు. . వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను అంతమొందించే కుట్రలో భాగంగానే వరుణ్‌రెడ్డిని కడప జైలుకు తీసుకొచ్చారని ఆరోపించారు.

వరుణారెడ్డి జైలర్‌గా ఉన్నప్పుడే మొద్దు శీను హత్య అనంతపురం జైల్లోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం వివేకా హత్యకేసులో నిందితులు కడప జైలులో ఉన్నారని అన్నారు. వరుణారెడ్డిని అక్కడ నియమించడంతో వారికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని, ఇతర అధికార పార్టీ నేతలను కాపాడేందుకు ఈ కుట్రలన్నీ పక్కాగా జరుగుతున్నాయని ఆరోపించారు అయితే విపక్షాల నుండి విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం వరుణారెడ్డిని కడప నుండి ఒంగోలుకు బదిలీ చేసింది.