కడప: కడప జిల్లా కేంద్రంలోని  ఓ హోటల్‌లో ఒక బిర్యానీ కొనుగోలు చేస్తే  మరో బిర్యానీ ఉచితంగా ఇస్తామని  హోటల్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో  బిర్యానీ కోసం జనం ఎగబడ్డారు. కరోనా  నిబంధనలను ఉల్లంఘిస్తూ హోటల్ వద్ద జనం గుంపులు గుంపులుగా చేరారు.  కొందరైతే  కనీసం ముఖానికి మాస్క్ లేకుండా  బిర్యానీ కోసం ఎగబడ్డారు.

ఈ విషయం తెలిసిన పోలీసులు హోటల్ నుండి జనాన్ని బయటకు పంపారు. పోలీసులు లాఠీలతో తరుముతున్నా కూడ పట్టించుకోకుండా బిర్యానీ కోసం జనం ఎగబడ్డారు. ఏపీ రాష్ట్రంలో కడప, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో మినీ లాక్‌డౌన్ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.  కరోనా వైరస్ వ్యాప్తిని  అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ  ఇవాళ సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో  కరోనా రోగులకు అవసరమైన మందులతో పాటు ఇతర సౌకర్యాల కొరత లేకుండా ఏర్పాట్లు చేసినట్టుగా ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రకటించారు.