జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై  ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాన్.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే పలువురు స్పందించగా... తాజాగా ఈ విషయంపై కేఏపాల్ స్పందించారు.

పవన్ కళ్యాణ్ కేవలం పవర్ కోసమే పార్టీ పెట్టారని ఆరోపించారు. పవన్ కి ఐదు నుంచి ఆరు శాతం కంటే ఎక్కువ ఓటింగ్ శాతం రాదని తాను ముందే చెప్పానని ఆయన అన్నారు. ఆయన పోటీచేసే సొంత సీటును కూడా పవన్ గెలవరని కూడా తాను ముందే చెప్పినట్లు గుర్తుచేశారు.

Also Read సచివాలయం శాశ్వతమని బాబు నిరూపిస్తే తలదించుకొని వెళ్తా: బొత్స సవాల్...

బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీ, జేడీ లక్ష్మినారాయణ టీంలతో కలిసి పొత్తులు పెట్టుకున్నాడని.. అయినా కూడా సొంత సీటు కూడా గెలవలేకపోయాడన్నారు. నూటికి ఇరవై ఐదు శాతం ఉన్న ఆయన సొంత సామాజిక వర్గం అయిన కాపులే ఆయనకు ఓటు వేయలేదన్నారు. మొత్తం ఆరుశాతం ఓట్లు మాత్రమే పడ్డాయన్నారు. గతంలో అన్నయ్య చిరంజీవికి 18 శాతం పడితే.. ఇప్పుడు తమ్ముడికి ఆరు శాతం మాత్రమే పడ్డాయని.. అది కూడా మూడు నాలుగు పార్టీలతో పొత్తు పెట్టకుంటేనంటూ ఎద్దేవా చేశారు.