ఢిల్లీ: తమ పార్టీ అధికారంలోకి వస్తే లోటు బడ్జెట్ ఉండదు. మిగులు బడ్జెట్ ఉంటుంది. రెండు లక్షల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తాం. ఐదు లక్షల కోట్లతో ఐదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఆయన చెప్పుకొస్తున్నారు. 

ఏడు కోట్ల కోట్ల నిధులు అంటే మామూలు విషయం కాదు.  మరి అన్ని కోట్ల నిధులు రప్పిస్తానని చెప్తున్న ఆ నాయకుడు ఎవరు..ఏ పార్టీ అధ్యక్షుడో తెలుసుకోవాలనుకుంటున్నారా..ఇంకెవరు.....కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. 

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే నిధుల వరద పారిస్తానని హామీ ఇస్తున్నారు. సంవత్సరానికి ఇంత అప్పులు చేస్తున్న వాళ్లు రాబడి లేనప్పుడు ఆ అప్పులు ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. 

రాబడి రావాలంటే పెట్టుపడులు, డొనేషన్లు కావాలని గుర్తు చేశారు. గతంలో తాను 200 దేశాల నుంచి 2045 మందితో బిజినెస్ కాన్ఫరెన్సులు పెట్టానని ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే అలాగే సదస్సులు పెట్టి డొనేషన్లు రాబడతానని స్పష్టం చేశారు. 

బిజినెస్ కాన్ఫరెన్సులు ఏర్పాటు చేసి ఏడు కోట్ల కోట్ల రూపాయలలో ఏడు లక్షల కోట్లు తీసుకొస్తానన్నారు. వాటిలో రెండు లక్షల కోట్లతో రుణమాఫీ తీరుస్తానని మిగిలిన ఐదు లక్షల కోట్లతో ఐదేళ్లకు బడ్జెట్ కేటాయింపులు జరుపుతామన్నారు. ఈ విషయాన్ని నిరుద్యోగులు, మహిళలు ఒక్కొక్కరూ వంద, వెయ్యి మందికి చెప్పి ప్రజాశాంతి పార్టీని గెలిపించాలంటూ కేఏ పాల్ కోరారు.