సొంత ప్రజలకు సేవ చేసేందుకు అమరావతికి తరలివచ్చిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర సిబ్బందికి రమణ ధన్యవాదాలు తెలిపారు. తాను బెజవాడ బార్ అసోసియేషన్‌లో సభ్యునిగానే తన న్యాయవాద వృత్తిని ప్రారంభించానని రమణ గుర్తు చేసుకున్నారు.

జనవరి 25 నాటికి హైకోర్టు భవనం ప్రారంభమవుతుందని ఆ రోజు జరిగే కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగొయ్ హాజరవుతారని రమణ వెల్లడించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందేశాన్ని జస్టిస్ రమణ చదివి వినిపించారు.

‘‘ అలాగే 1954 జూలై 5 వ తేదీన నాటి ఆంధ్రా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు హైకోర్టు ఏర్పాటు సందర్భంగా చెప్పిన మాటలను గుర్తు చేశారు. హైకోర్టు వచ్చిందన్న సంతోషం కన్నా దానిని ఎలా పరీరక్షించుకోవాలన్న దానిపైనే న్యాయవ్యవస్థ మనుగడ ఆధారపడి వుందని రమణ అన్నారు.