Asianet News TeluguAsianet News Telugu

బిసి కమీషన్..కాపురిజర్వేషన్ కోసం కాదట

కాపులను బిసిల్లో చేర్చటానికి కాకపోతే మరి చంద్రబాబు మంజూనాధ కమీషన్ ఎందుకు వేసినట్లు. కాపులను బిసిల్లోకి చేర్చటానికి కాకపోతే కాపులకు బిసి రిజర్వేషన్ కల్పించేందుకే కమీషన్ వేసానని ఇంతకాలం ఎందుకు చెప్పినట్లు? పోనీ మంజూనాధ కూడా ఇపుడే బిసి కమీషన్ కు కాపులను బిసిల్లో చేర్చటానికి ఎటువంటి సంబంధమూ లేదని ఎందుకు చెబుతున్నారు? ఇంతకాలం ఎందుకు చెప్పలేదు.

justice manjunatha says bc commission is not for kapu reservation

బిసి కమీషన్ ఛైర్మన్ మంజూనాధ పెద్ద బాంబునే పేల్చారు. కాపులను బిసిల్లోకి చేర్చే విషయమై అధ్యయనం చేసేందుకే మంజూనాధ కమీషన్ వేసినట్లు ఇంతకాలం చంద్రబాబునాయుడు చెబుతూ వస్తున్నారు. అయితే, ఈరోజు జస్టిస్ మంజూనాధ మాట్లాడుతూ, బిసిల స్ధితిగతులపై అధ్యయనం చేసేందుకు మాత్రమే బిసి కమీషన్ వేసినట్లుగా స్పష్టం చేసారు. కాపులకు బిసి రిజర్వేషన్ కల్పించేందుకు, తమ కమీషన్ కు ఎటువంటి సంబంధమూ లేదని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు.

తాము జరిపిన రాష్ట్ర పర్యటనల్లో 62 కులాల వారు తమను బిసిల్లోకి చేర్చాలంటూ వినతులిచ్చినట్లు తెలిపారు. 32 బిసికులాల వారు తమ క్యాటగిరీలను మార్చాలని కోరారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి సేకరించిన డేటాను విశ్లేషిస్తున్నట్లు మంజూనాధ తెలిపారు. ఇక్కడే అందరిలోనూ ఒక అనుమానం తొంగిచుస్తోంది. కాపులను బిసిల్లోకి చేర్చే విషయమై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వటానికే మంజూనాధ కమీషన్ వేసినట్లు చంద్రబాబు చెప్పటానికి, ఇపుడు మంజూనాధ చెబుతున్న మాటలకు చాలా వ్యత్యాసముంది.

కాపులను బిసిల్లో చేర్చటానికి కాకపోతే మరి చంద్రబాబు మంజూనాధ కమీషన్ ఎందుకు వేసినట్లు. కాపులను బిసిల్లోకి చేర్చటానికి కాకపోతే కాపులకు బిసి రిజర్వేషన్ కల్పించేందుకే కమీషన్ వేసానని ఇంతకాలం ఎందుకు చెప్పినట్లు? పోనీ మంజూనాధ కూడా ఇపుడే బిసి కమీషన్ కు కాపులను బిసిల్లో చేర్చటానికి ఎటువంటి సంబంధమూ లేదని ఎందుకు చెబుతున్నారు? ఇంతకాలం ఎందుకు చెప్పలేదు.

తమను బిసిల్లో చేర్చాలంటూ కాపులు రాష్ట్రవ్యాప్తంగా ఇంతకాలం వినతి పత్రాలు ఇస్తుంటే మరి ఎందుకు తీసుకున్నట్లు? తీసుకున్న వినతులను ఏం చేసారు? మొదట్లోనే తనను కలసిన కాపు నేతలకు ఇపుడు చెప్పిన విషయాన్నే స్పష్టం చేసి ఉండవచ్చు కదా? కమీషన్ గడువు పూర్తి కావచ్చే సమయంలో అందులోనూ నంద్యాల ఉపఎన్నికల ముందు మంజూనాధ బాంబు పేల్చటమేంటి?

Follow Us:
Download App:
  • android
  • ios