Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ప్రభుత్వాన్ని రద్దు చేయాలి

చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్ చేయాలంటూ  డిమాండ్ చేసారు. సోషల్ మీడియా స్వచ్చంధ కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టు చేయటంపై కట్జూ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వ చర్యలు అనాగరికం, అప్రజాస్వామ్యమంటూ మండిపడ్డారు.

Justice katju demands center to dismiss naidus government

జస్టిస్ మార్కండేయ్ కట్జూ చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్ చేయాలంటూ  డిమాండ్ చేసారు. సోషల్ మీడియా స్వచ్చంధ కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టు చేయటంపై కట్జూ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వ చర్యలు అనాగరికం, అప్రజాస్వామ్యమంటూ మండిపడ్డారు.

ఇంటూరి రవికిరణ్ అరెస్టు చేయటాన్ని తప్పుపట్టారు. ఇదే విషయమై రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ కూడా రాసారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఆర్టికల్ 356 ప్రయోగించాలని లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని చెప్పారు.  సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు రాజ్యంగ విరుద్ధమన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలని కూడా డిమాండ్ చేసారు.

భావప్రకటనా స్వేచ్చలో కార్టూన్లు వేయటం కూడా ఓ భాగమేనని జస్టిస్ అభిప్రాయపడ్డారు. పౌరులకు భావప్రకటనా స్వేచ్ఛను రాజ్యాంగం ప్రసాదించిన హక్కుగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించే, విమర్శించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉందన్నారు. ఆ హక్కును కాలరాస్తున్న కారణంగానే శాసనసభను రద్దు చేసి తక్షణ చర్యలకు దిగాలంటూ రాష్ట్రపతి, ప్రధానమంత్రిని లేఖలో డిమాండ్ చేసారు.  ఆర్టికల్ 19 (1) (a) ప్రకారం పౌరుల స్వేచ్చను చంద్రబాబు ప్రభుత్వం హరిస్తోందని కట్జూ ధ్వజమెత్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios