ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్: ప్రమాణం చేయించిన గవర్నర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా  ధీరజ్ సింగ్ ఠాకూర్  శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ గవర్నర్  అబ్దుల్ నజీర్  ధీరజ్ సింగ్ ఠాకూర్ తో ప్రమాణం చేయించారు.

Justice Dhiraj Singh Thakur sworn in as Chief Justice of Andhra Pradesh High Court lns


అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా  ధీరజ్ సింగ్  ఠాకూర్  శుక్రవారంనాడు  ప్రమాణం చేశారు.  ఏపీ రాష్ట్ర గవర్నర్   ధీరజ్ సింగ్ ఠాకూర్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు  నాయుడు , పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ నెల 5వ తేదీన  సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలిజియం సిఫారసులను  కేంద్రం  ఆమోదం తెలిపింది. ముంబై హైకోర్టు న్యాయమూర్తిగా  ఉన్న ధీరజ్ సింగ్ ఠాకూర్ ను  ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా  నియమిస్తూ  కేంద్రం ఆదేశాలు  జారీ చేసిన విషయం తెలిసిందే. 

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా  నియమితులైన  ధీరజ్ సింగ్ ఠాకూర్  గురువారంనాడు రాత్రి అమరావతికి చేరుకున్నారు.   ఇవాళ ఉదయం  ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా  ఆయన ప్రమాణం చేశారు.

1964  ఏప్రిల్ 25న జస్టిస్ ఠాకూర్  జన్మించారు.1989 లో ఢిల్లీలో న్యాయవాది వృత్తిని చేపట్టారు.ఆ తర్వాత  ఆయన జమ్మూకాశ్మీర్ లో  న్యాయవాదిగా పనిచేశారు.  2011లో ఆయన  సీనియర్ అడ్వకేట్ అయ్యారు.  2013  మార్చి  8న  జమ్మూ కాశ్మీర్  హైకోర్టుకు  శాశ్వత జడ్జిగా  నియమితులయ్యారు.  2022  జూన్ 10న  ఠాకూర్  ముంబై హైకోర్టుకు  బదిలీ అయ్యారు. ముంబై నుండి ఆయనను  ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా  నియమించారు.జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ధీరజ్ సింగ్ ఠాకూర్  కుటుంబంలో  అందరూ  న్యాయమూర్తులే.  సుప్రీంకోర్టు రిటైర్డ్  చీఫ్ జస్టిస్  తీర్థసింగ్ ఠాకూర్  ధీరజ్ సింగ్  ఠాకూర్ సోదరుడే. 

Justice Dhiraj Singh Thakur sworn in as Chief Justice of Andhra Pradesh High Court lns

ఇప్పటి వరకు  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేస్తున్న పీకే మిశ్రా  సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యారు.తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఇటీవలనే అలోక్ అరాధే  ప్రమాణం చేశారు.  తెలంగాణకు  ఆరో జడ్జిగా  ఆయన  బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios