AP High Court CJ: ఏపీ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తి.. ఇంతకీ ఎవరంటే..?
AP High Court CJ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ నియమితులయ్యారు. ఇటీవల సుప్రీం కోర్టు కొలిజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర తెలుపుతూ.. ఠాకూర్ నియామకంపై అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించారు.

AP High Court CJ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి నియమితులయ్యారు. జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీం కోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. కొలిజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర చేశారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ప్రశాంత్‌కుమార్ మిశ్రా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది.
జులై 5వ తేదీన కొత్త ఏపీ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ధీరజ్ సింగ్ ఠాకూర్ ను నియమించాలని సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ అందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం జారీచేసింది. కొలిజియం సిఫార్సులపై రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ ట్విటర్‌లో పేర్కొన్నారు.