తమ్ముళ్లూ... జెపి సార్ ఎందుకు చెప్పారో కాస్త ఆలోచిస్తారా?
వాస్తవాలు చెబుతుంటే వినటానికి ఎవరికైనా కఠినంగానే ఉంటుంది. లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఇపుడు చేసిందదే. నిప్పు చంద్రబాబునాయుడు ప్రభుత్వ తీరును, ప్రచారార్భాటాన్ని ఎత్తి చూపుతున్నారు. ‘చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆర్భాటం జాస్తి-వాస్తవం నాస్తి’ అన్నట్లుందన్నారు. చంద్రబాబుదంతా ఈవెంట్ మేనేజ్మంట్ వ్యవహారంగా వర్ణించారు. ప్రతిరోజూ పెద్ద ఆర్భాటమట. ఏదో చేస్తున్నామని భ్రమలు కల్పిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. దీర్ఘకాలిక దృక్పధంతో మన పిల్లలకు ఉపాధి కల్పించటం కోసం ఏం చేయాలన్న దానిపై లోతైన అవగాహన, దిశానిర్దేశం కొరవడిందన్నారు. జెపి సార్ చెబితే నిజమే అయ్యుంటుంది.
విద్య, ఆరోగ్యం విషయంలో ఏ రాష్ట్రంతో పోల్చినా మన పరిస్ధితి అధ్వాన్నంగా ఉందని నిష్టూరమాడారు. చంద్రబాబు ప్రయత్నంలో నిజాయితీ కొరవడిందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. పైగా మ్యాజిక్కులు, చిట్కాలతో ఏ రాష్ట్రం కూడా బాగుపడలేదన్నారు. ఆర్భాటాలు, ప్రగల్భాల రాష్ట్రంగా పత్రికల్లో ప్రచారం పొందే రాష్ట్రంగా ఏపి మిగిలిపోతోందని వాపోయారు. ప్రత్యేక హోదానా, ప్యాకేజినా అన్నదానితో నిమ్మితం లేకుండా యువతకు మంచి ఉపాధి అవకాశాలు వచ్చేలా కేంద్రం నుండి పారిశ్రామిక రాయితీలు పొందాలంటూ జెపి సూచించారు. తమ్ముళ్లూ... జెపి సార్ ఎందుకు చెప్పారో కాస్త ఆలోచిస్తారా?
ఆయన చెబుతున్నవన్నీ నిజాలే అయినప్పటికీ వినటానికి కఠినంగా ఉంటాయి కదా నారావారి భజన బృందానికి. నిజాలే చెబుతున్నారు.
