ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం 10.15 నిమిషాలకు హైకోర్టులోని ఒకటో నెంబర్ కోర్టు హాల్ లో జస్టిస్ జోయ్ మాల్య బాగ్చితో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి ప్రమాణ స్వీకారం చేయించారు. 

సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ జోయ్ మాల్య బాగ్జి కోల్ కత్తా నుంచి ఏపీకి బదిలీ అయ్యారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు పలువురు న్యాయవాదులు, హైకోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు. 

ఏపీ హైకోర్టు జడ్జీల సీనియారిటీలో జస్టిస్ బాగ్చి రెండో స్థానంలో కొనసాగుతారు. మరోవైపు జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ నెల 6న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.