Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుపై పోటీకి కూడా రెడీ.. జోగి రమేష్

పెనమలూరు నుంచి చంద్రబాబు బరిలోకి దిగినా  పోటీకి సిద్ధమేనని తేల్చి చెప్పారు.  వైసీపీ విజయానికి సైనికుడిలా పనిచేస్తానన్నారు.  పెడనలో నా సిట్టింగ్ స్థానం వేరే వారికి ఇస్తే వారి గెలుపుకు సహకరిస్తానని చెప్పుకొచ్చారు.

Jogi Ramesh ready to contest against Chandrababu - bsb
Author
First Published Jan 12, 2024, 3:49 PM IST

పెనమలూరు : ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ జాబితాలు కాక రేపుతున్నాయి.   టికెట్ రానివారు పార్టీలు మారుతుంటే… టికెట్లు దక్కిన వారు  సంతోషంతో జగనన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు కొంతకాలంగా చర్చల్లో ఉన్న పెనుమలూరు అసెంబ్లీ స్థానానికి  టికెట్ వైసిపి మూడో జాబితాలో మంత్రి జోగు రమేష్ కు దక్కింది.  పెనుమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధికి  చోటు దక్కలేదు. దీంతో పార్థసారథి టిడిపిలో చేరతారని  వస్తున్న ఊహాగానాలు నిజం కాబోతున్నాయి. శుక్రవారం నాడు కొలుసు పార్థసారథి చంద్రబాబుతో భేటీ అవుతున్నారు ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు పార్థసారథి. 

మరోవైపు పెనుమలూరు టికెట్ దక్కిన మంత్రి జోగు రమేష్ అక్కడి నుంచి పోటీ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.  వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ఏది చెబితే అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. పెనమలూరు నుంచి చంద్రబాబు బరిలోకి దిగినా  పోటీకి సిద్ధమేనని తేల్చి చెప్పారు.  వైసీపీ విజయానికి సైనికుడిలా పనిచేస్తానన్నారు.  పెడనలో నా సిట్టింగ్ స్థానం వేరే వారికి ఇస్తే వారి గెలుపుకు సహకరిస్తానని చెప్పుకొచ్చారు.

టీడీపీలోకి పార్థసారథి?: తెర వెనుక కారణలివీ

2009లో పెడన నుంచి పోటీ చేశానని..  2014లో మైలవరం నుంచి జగన్ పోటీ చేయించారని కానీ తాను ఓడిపోయానని తెలిపారు.  ఇప్పుడు జగన్ పెనమలూరు నుంచి పోటీ చేయమని పంపుతున్నారని.. అక్కడ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.  బెజవాడ ఎంపీగా కేశినేని నాని తప్పకుండా గెలుస్తారన్నారు.  టిడిపిలో ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ను తిట్టాల్సి వచ్చి ఉంటుందని.. తప్పదు కాబట్టి నాని అలా మాట్లాడి ఉండొచ్చని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios