హెరిటేజ్ ను వేల కోట్ల లాభాల్లోకి ఎలా తెచ్చారు: బాబును ప్రశ్నించిన జోగి రమేష్

హెరిటేజ్ ను వేల కోట్ల లాభాల్లోకి ఎలా తెచ్చారు: బాబును ప్రశ్నించిన జోగి రమేష్

విజయవాడ: హేరిటేజ్‌ను వేల కోట్ల లాభాల్లో ఎలా తీసుకువచ్చారో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జోగి రమేష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిని చూసి ప్రజలు ఛీ కొడుతున్నారని ఆయన అన్నారు. రేపు ఈ నెల 2వ తేదీన చంద్రబాబు తలపెట్టిన నవనిర్మాణ దీక్షను వ్యతిరేకిస్తూ ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. 

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిది నవ నిర్మాణ దీక్ష కాదు, నయవంచన దీక్ష ఆయన వ్యాఖ్యానించారు.  చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష ఎందుకు చేస్తున్నారని అడిగారు. చంద్రబాబు ఏం సాధించారో చెప్పకుండా దీక్షలు చేస్తున్నారని అన్నారు. 

తన తనయుడు లోకేష్‌కి కనీస జ్ఞానం లేకుండా మంత్రిని చేసినందుకు నవ నిర్మాణ దీక్ష చేస్తున్నారా అని ప్రశ్నించారు.  టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక నుంచి మట్టి వరకు అన్నింటినీ దోచుకున్నందుకు దీక్ష చేస్తున్నావా? లేక రాష్ట్రాన్ని అవినీతిమయం చేసినందుకా దీక్ష చేస్తున్నావా అని అడిగారు.

కాపులను రిజర్వేషన్‌ పేరుతో, డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరుతో మోసం చేసినందుకా? నిరుద్యోగులను భృతి పేరుతో వంచించినందుకు దీక్ష చేస్తున్నావా అని జోగి రమేష్ అడిగారు.  

కుర్చీ కోసం ఆరాటపడింది చంద్రబాబు కాదా, సిఎం కుర్చీ కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచిందెవరని అడిగారు. గుడినీ గుడిలో లింగాన్నీ టీడీపి నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. బెజవాడ కనకదుర్గమ్మ గుడిని కూడా దోచుకుంటున్నారని అన్నారు. టీడీపి నేతలు రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారని అన్నారు. చంద్రబాబు 2 ఎకరాల రైతు నుంచి రుూ.2 లక్షల కోట్ల ఆసామి వరకు ఎలా ఎదిగారో చెప్పాలని అన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page