విశాఖ జిల్లా గోపాలపట్నంలోని శ్రీ జ్యువెలరీ షాపులో చోరీకి పాల్పడిన దుండగులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించారు. 

విశాఖపట్నంలో దొంగలు రెచ్చిపోయారు. గోపాలపట్నంలోని శ్రీ జ్యువెలరీ షాపులో చోరీకి పాల్పడి భారీగా బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించారు. సుమారు 480 గ్రాముల బంగారం, 15కేజీల వెండి అపహరణ గురయినట్లు జువెల్లరీ షాప్ యాజమాన్యం గుర్తించింది. 

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కారణంగా కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గోపాలపట్నంలోని శ్రీ జువెల్లరీ షాప్ ను బుధవారం సాయంత్రం ఆరు గంటలకే మూసేశారు. షాప్ లోని ఆభరణాలను సరిచూసుకుని సిబ్బంది మొత్తం వెళ్లిపోయిన తర్వాత యజమాని తాళం వేసుకున్నాడు. 

read more దండుపాళ్యం ముఠా అరెస్ట్: ఆరు హత్యలు, మరో పది మంది హత్యకు రెక్కీ

అయితే ఇవాళ(గురువారం) ఉదయం షాప్ ను తెరవడానికి వెళ్లగా షట్టర్ తాళం పగలగొట్టి వుంది. దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగినట్లు గుర్తించి దొంగలను గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. క్లూస్ టీం ను రప్పించి ఆదారాలను సేకరిస్తున్నారు.

అర్ధరాత్రి సమయంలో దొంగలు షాపు షట్టర్ ను తొలగించి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సిసి కెమెరాల ద్వారా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. జువెల్లరీ షాప్ యజమాని తెలిపిన వివరాల ప్రకారం బంగారం,వెండి నగలు చోరీకి గురయినట్లు తెలుస్తోంది.