రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని, జగన్‌ను కూడా మిత్రుడ్ని చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామని జెసి అన్నారు.  ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా ఎంపీలను సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు మేకై కూర్చుoటాడని మోడీకి భయమని ఆయన అన్నారు.

న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మిత్రుడిని చేసుకోవడానికి కూడా తాము సిద్ధమేనని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై ఎంపీ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని, జగన్‌ను కూడా మిత్రుడ్ని చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామని జెసి అన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా ఎంపీలను సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు మేకై కూర్చుoటాడని మోడీకి భయమని ఆయన అన్నారు.

రాయలసీమ ముఠా నాయకుడిలా నరేంద్రమోడీ తీరు ఉందని అన్నారు.. నరేంద్రమోడీ అసమర్థ ప్రధాని అని విమర్శించారు. ప్రధానిగా ఉండి అసత్యాలు మాట్లాడటానికి సిగ్గు లేదా అని ఆయన ప్రశ్నించారు. ఆనాడు కాంగ్రెస్ రాష్ట్రానికి దుష్టశక్తి అయితే నేడు బీజేపీ దేశానికే దుష్టశక్తి అని ఆయన అన్నారు..