తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నకిలీ పత్రాలతో ఏ విధంగా వాహనాలకు రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నకిలీ పత్రాలతో ఏ విధంగా వాహనాలకు రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించారు. దేశంలో తనపై తప్ప ఎవరిపైనా ఇలాంటి కేసులు పెట్టలేదని అన్నారు. తాను 28 వాహనాలను కొనుగోలు చేస్తే 156 కేసులు పెట్టారని చెప్పారు. తాము వాహనాలు కొనుగోలు చేసిన సమయంలో 63 వేల వాహనాలను అశోక్ లే ల్యాండ్ అమ్మకాలు సాగించిందన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాహనాలకు బీమా చేయించకుండా రిజిస్ట్రేషన్ చేయించానని ఆరోపిస్తూ తనపై కేసు పెట్టాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్పడం అవివేకమన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేతనైతే తనపై కేసు పెట్టించాలని సవాలు విసిరారు.
Also Read: కులం పేరుతో దూషించారని ఫిర్యాదు.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..
ఇప్పటికే తాను 156 రోజులు జైలుకి వెళ్లి బాధపడి వచ్చానని చెప్పారు. ఎమ్మెల్యే చెప్పినట్లు చదువుకున్న అధికారులు ఎవరూ చేయరని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒక పిచ్చోడని, ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డి బైక్ రేస్‌లు, గుర్రాలు రేస్‌లు చేసుకోవాలంటూ సెటైర్లు వేశారు.
