టీడీపి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 12, Aug 2018, 1:01 PM IST
JC Prabhakar reddy not to contest next elections
Highlights

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయనని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఆదివారం తాడిపత్రిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

అనంతపురం: తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి బాటలోనే తమ్ముడు జెసి ప్రభాకర్ రెడ్డి నడవనున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని తెలుగుదేశం పార్టీ తాడిపత్రి ఎమ్మెల్యే అయిన జెసి ప్రభాకర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయనని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఆదివారం తాడిపత్రిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి తన కుమారుడు అస్మిత్‌రెడ్డి పోటీ చేస్తాడని చెప్పారు. 

తాను మాత్రం ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని, ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒత్తిడి తెస్తే మాత్రం పోటీ చేస్తానని చెప్పారు. ఆరోగ్యం సహకరించకపోతే రాజీనామా చేస్తానని చెప్పారు.

loader