తాడిపత్రి: తన అనుచరులపై దాడికి దిగిన విషయం తెలుసుకొన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హుటాహుటిన జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి చేరుకొన్నారు. తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు.

ఇసుక సరఫరా విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నానని ఎమ్మెల్మే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ఇంటికి వెళ్లి  ఆయన అనుచరులపై దాడికి దిగారు. 

also read:జేసీ కుర్చిలో కూర్చొన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి: దగ్ధం చేసిన ప్రభాకర్ రెడ్డి అనుచరులు

అయితే అదే సమయంలో తన బంధువులకు ఆరోగ్యం బాగా లేదని తెలిసి పరామర్శకు వెళ్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అస్మిత్ రెడ్డిలు మార్గమధ్యలోనే తాడిపత్రికి తిరుగు పయనమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు తాడిపత్రికి వచ్చే సమయానికి  నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తన నివాసంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో సమావేశమయ్యారు. కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన అనుచరులు చేసిన దాడి గురించి అనుచరులు ప్రభాకర్ రెడ్డికి వివరించారు.జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి సమీపంలో పెద్దారెడ్డి, జేసీ వర్గీయులు భారీగా మోహరించారు.