అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకొంది.  మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి  ఇంట్లో ఆయన కుర్చీలో కూర్చోవడంపై జేసీ వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయన వర్గీయులపై కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడికి దిగడంతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఇసుక సరఫరా విషయంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి డబ్బలు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో జేసీ వర్గీయులు పోస్టులు పెట్టారని కోపంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి  జేసీ ప్రభాకర్ రెడ్డి  ఇంటికి వెళ్లి ఇద్దరిపై దాడికి దిగారు.

also read:తాడిపత్రిలో ఉద్రిక్తత: టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్లదాడి, పోలీసుల లాఠీచార్జీ

ఈ దాడి చేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే కూర్చొనే కుర్చీలో పెద్దారెడ్డి కూర్చొన్నారు. జేసీ ఇంటి నుండి పెద్దారెడ్డి వెళ్లిపోయిన తర్వాత  ఈ కుర్చీని జేసీ వర్గీయులు తీవ్రంగా పరిగణించారు. ఈ కుర్చీని జేసీ వర్గీయులు దగ్దం చేశారు.  జేసీ ఇంటి సమీపంలో ఇరు వర్గాలు మోహరించారు. పరస్పరం రాళ్ల దాడికి దిగారు.