తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం నాడు టీడీపీ , వైఎస్ఆర్‌సీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకొంది. మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి ఇంటికి సమీపంలో రెండు వర్గాలు మోహరించాయి. ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు.

also read:తాడిపత్రిలో టెన్షన్: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఇద్దరిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి దాడి

ఈ విషయం తెలుసుకొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి హైద్రాబాద్ నుండి అనంతపురానికి బయలుదేరారు. పోలీసులు లాఠీచార్జీ చేస్తున్నా కూడ ఇరు వర్గాలు లెక్క చేయడం లేదు. ఇరువర్గాలు రాళ్ల దాడికి దిగారు.ఇరువర్గాల రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

 

ఇసుక విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నారని   సోషల్  మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెతద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఉన్నారని తెలుసుకొని జేసీ ఇంటికి పెద్దారెడ్డి వచ్చి దాడికి దిగాడు. ఈ విషయం తెలుసుకొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు  అక్కడికి భారీగా చేరుకొన్నారు. అప్పటికే అక్కడ ఉన్న కేతిరెడ్డి వర్గీయులు రాళ్ల దాడికి దిగారు.