Asianet News TeluguAsianet News Telugu

ముగిసిన ప్రభాకర్ రెడ్డి ఈడీ విచారణ... బాగా చూసుకున్నారన్న జేసీ

టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ముగిసింది. ఈడీ అధికారులు తనను బాగా ట్రీట్ చేశారని జేసీ అన్నారు. ఈడీ ప్రశ్నలకు సమాధానం చెప్పానని.. తాను మనీలాండరింగ్‌కు పాల్పడలేదని ప్రభాకర్ పేర్కొన్నారు. 

jc prabhakar reddy ed inquiry end
Author
First Published Oct 7, 2022, 7:43 PM IST

టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ముగిసింది. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి రిజిస్ట్రేషన్ చేసిన అభియోగంపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి శుక్రవారం ఈడీ ఎదుట ఆయన హాజరయ్యారు. దాదాపు 5 గంటల పాటు జేసీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విచారణకు పిలిస్తే వచ్చానని అన్నారు. 

వాళ్ల రాజ్యంలో వాళ్లు చెప్పిందే అవుతుందని.. తనను ఏదో చేయాలని చూశారని ప్రభాకర్ పేర్కొన్నారు. ఈడీ అధికారులు తనను బాగా ట్రీట్ చేశారని జేసీ అన్నారు. ఈడీ ప్రశ్నలకు సమాధానం చెప్పానని.. తాను మనీలాండరింగ్‌కు పాల్పడలేదని ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ కేసుతో తనకేం సంబంధం లేదని.. ఈడీ ఎప్పుడు పిలిచినా వెళ్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈడీ అధికారులకు అన్ని వివరాలు ఇచ్చానని.. మళ్లీ రమ్మన్నారని ఆయన చెప్పారు. మా తరపున ఎలాంటి అవకతకవలు జరగలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 

Also REad:కారణమిదీ: ఈడీ అధికారుల ముందు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి

కాగా.. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా నకిలీ ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. గడువు తీరి విక్రయం కాకుండా ఉన్న 154 లారీలను నాగాలాండ్ లో స్క్రాప్ కింద కోనుగోలు చేశారు. 2018లో నాగాలాండ్ లో 154 వాహనాలను రిజిస్ట్రేషన్ చేశారు. వీటిలో కొన్నింటిని ఇతరులకు విక్రయించారు. మరికొన్నింటిని జేసీ కంపెనీ నిర్వహిస్తుంది. 

ఈ వాహనాలు కొనుగోలు చేసిన కొందరు  అప్పట్లో జేసీ  ప్రభాకర్ రెడ్డి నివాసం ముందు ఆందోళన కూడా నిర్వహించారు. నకిలీ పత్రాలతో ఈ వాహనాలను కట్టబెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై కొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. మరో వైపు ఇదే విషయమై ఐదు మాసాల క్రితం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారులు ఈ విషయమై కేసు నమోదు చేశారు. ఈ విషయమై అందిన నోటీసుల మేరకు ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. 

తనపై ఉద్దేశ్యపూర్వకంగానే  కేసు నమోదు చేశారని అప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.  తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. ఈ విషయమై తాము న్యాయపరంగా తేల్చుకొంటామని జేసీ కుటుంబ సభ్యులు తెలిపారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని  జేసీ కుటుంబ సభ్యులు ప్రకటించిన  విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios