Asianet News TeluguAsianet News Telugu

కారణమిదీ: ఈడీ అధికారుల ముందు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ ఈడీ అధికారుల మందు హాజరయ్యారు బీఎస్ 3 వాహనాలను  బీఎస్ 4 వాహనాలుగా మార్చి విక్రయించారనే కేసులో  ఈడీ ముందు ఆయన హాజరయ్యారు. 

 TDP Leader JC Prabhakar Reddy Appears Before ED
Author
First Published Oct 7, 2022, 2:36 PM IST

హైదరాబాద్:  బీఎస్-3వాహనాలను బీఎస్-4 వాహనాలలుగా విక్రయించారనే కేసులో మాజీ ఎమ్మెల్యే,టీడీపీ నేత జేసీ  ప్రభాకర్ రెడ్డి  శుక్రవారం నాడు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు.జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి కూడ ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. 

బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 మార్చి రిజిస్ట్రేషన్ చేసి విక్రయించారని  జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన సంస్థపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ విషయమై జేసీ ప్రభాకర్ రెడ్డి కి నోటీసులు జారీ చేసింది.ఈనోటీసులు అందుకున్నజేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ ఈడీ కార్యాలయానికి వచ్చారు.  

బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా నకిలీ ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది.  గడువు తీరి విక్రయం కాకుండా ఉన్న154 లారీలను నాగాలాండ్ లో స్క్రాప్ కింద కోనుగోలు చేశారు. 2018లో  నాగాలాండ్ లో154 వాహనాలను రిజిస్ట్రేషన్ చేశారు. వీటిలో కొన్నింటిని  ఇతరులకు విక్రయించారు. మరికొన్నింటిని  జేసీ కంపెనీ నిర్వహిస్తుంది. 

ఈ వాహనాలు కొనుగోలు చేసిన కొందరు  అప్పట్లో జేసీ  ప్రభాకర్ రెడ్డి నివాసం ముందు ఆందోళన కూడా నిర్వహించారు.  నకిలీ పత్రాలతో ఈ వాహనాలను కట్టబెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై కొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు  ఆధారంగా కేసు నమోదైంది.  మరో వైపు ఇదే విషయమై ఐదు మాసాల క్రితం  ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.  ఈడీ అధికారులు ఈ విషయమై కేసు నమోదు చేశారు. ఈ విషయమై  అందిన నోటీసులమేరకు ఇవాళ జేసీ ప్రభాకర్  రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ఐదుగంటల పాటు ఈడీ  అధికారులు విచారించారు.

తనపై  ఉద్దేశ్యపూర్వకంగానే  కేసు నమోదు చేశారని అప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.  తప్పుడు కేసులు నమోదుచేశారన్నారు. ఈ విషయమైతాముే న్యాయపరంగా తేల్చుకొంటామనిబజేసీ కుటుంబ సభ్యులు తెలిపారు.రాకీయ కక్షతోనే కేసు నమోదుచేశారని  జేసీ కుటుంబ సభ్యులు ప్రకటించిన  విషయం తెలిసిందే. 

తనపై దొంగ కేసు నమోదుచేశారన్నారు. ఈ కేసు దొంగకేసు అనే విషయం ఈడీ అధికారులకు ఏం తెలుసునని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. తాను ఎక్కడ కబ్జాలు కానీ ఏమీ చేయలదేన్నారు. అలాంటి తాను ఎందుకు భయపడాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఈడీ అధికారులు పిలిస్తే వెళ్తామన్నారు. కానీ తాము వెళ్లాలనుకొంటేఈడీ కార్యాలయానికి వస్తామన్నారు. ఇది ప్రభుత్వం పెట్టిన కేసు అని జేసీ ప్రభాకర్ రెడ్డి  మీడియాకు చెప్పారు. 


సాక్షి మీడియాపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం

ఈడీ కార్యాలయం వద్ద సాక్షి మీడియాపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీవే కేసు పెట్టావు కదా అని ప్రశ్నించారు. ఈ కేసులో జైలుకు పోతారని  ప్రచారం చేస్తున్నారని సాక్షి మీడియా చానెల్ లోగోను చేయితో వెనక్కి నెట్టారు. మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి  వద్ద తన లోగోను  సాక్షి ప్రతినిధి  పెట్టేప్రయత్నం చేశారు. ఈ సమయంలో  జేసీ ప్రభాకర్ రెడ్డి పక్కకు పో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు భయపడతానా?  అంటూ  కారు  డోర్ వేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios