అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా ధర్మపోరాట దీక్షలో వైఎస్ జగన్ కు కులపిచ్చి ఉందంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు జేసీ. జేసీ వ్యాఖ్యలపై వైసీపీ కౌంటర్ ఇస్తుండగానే మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. 

జగన్ కులప్రతిపాదకన ఓట్లు అడుగుతున్నాడంటూ మండిపడ్డారు. రెడ్డి, రెడ్డి, రెడ్డి అంటున్నారు. పెళ్లిళ్లు చేసుకున్నప్పుడు అడ్డు రాని కులం, ఓట్లు అడిగేటప్పుడు మాత్రమే ఎందుకు వస్తోంది? అంటూ నిలదీశారు. సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, జనార్దన్‌రెడ్డి, చెన్నారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇలా రెడ్డిలే రాజ్యమేలారు. 

ప్రజల ఆదరణ ఉంటే సీఎం అవుతారు తప్ప కులాభిమానంతో కాదని జేసీ చెప్పారు. కానీ నీ సత్తా ఏంది..? నీ ముఖానికి ఏం విలువ ఉంది..? రెడ్లు అయితే కొమ్ములు ఉంటాయా..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

రెడ్డిని అని విరుచుకుపడుతున్న జగన్ నీ చెల్లెలు ఏ కులస్థుడిని పెళ్లి చేసుకుంది? బ్రాహ్మణుడిని చేసుకోలేదా అంటూ నిలదీశారు. సమాజంలో అందరం ఒక్కటేనన్న భావనతో ఆమె పెళ్లి చేసుకుందని గుర్తు చేశారు. 

మరోవైపు వైఎస్ జగన్‌, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఇద్దరూ సంకనాకి పోతారంటూ విరుచుకుపడ్డారు. తిత్లీ వంటి తుఫానుతో ఇబ్బంది పడుతున్నప్పుడు రాష్ట్రానికి రాని ప్రధాని ఇప్పుడు ఏం చేద్దామని వస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. 

కక్షపూరితంగా వ్యవహరిస్తే ఏ దేశంలో అయినా ఏ ప్రధాన మంత్రికి కూడా మంచిదికాదన్న జేసీ ఇప్పటికైనా వైఖరి మార్చుకుంటే ప్రధానికి భవిష్యత్తులో బాగుంటుందని లేదంటే ఆయన ఖర్మకు ఆయనే పోతాడంటూ వ్యాఖ్యానించారు. లేదంటే ఆయన ఖర్మ’’ అని జేసీ అన్నారు.
 

ఈ వార్తలు కూడా చదవండి

అలా చేస్తే జగన్ సీఎం అయ్యేవాడు: జేసీ దివాకర్ రెడ్డి

జగన్ పై జేసీ కామెంట్స్.. స్పందించిన విజయసాయి